AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్.. ఎలా పనిచేస్తుందంటే?

పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో పావురాలు కూడా ఒకటి. ఇవి తరచూ బాల్కనీలకు వస్తూ దాన్ని మొత్తం కరాబు చేస్తూ ఉంటాయి. మురికిగా మారుస్తాయి. వీటిని తమిరికొట్టేందుకు జనాలు రకరకాల పద్దతులను ఫాలో అవుతారు. అయినప్పటికి అవి మళ్లీ వస్తుంటాయి. అయితే తాజాగా ఓ టెక్ ప్రియుడు మాత్రం ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం కనిపెట్టాడు. AI టెక్నాలజీతో పనిచేసే ఒక ఆటోమేటెడ్ వాటర్ గన్‌ను సులభంగా పావురాలను తమిరికొడుతూ అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకూ వాటర్‌ గన్‌తో పావురాలు ఎలా పోతాయనేగా మీ డౌట్ అయితే క్లారిటీగా తెలుసుకుందాం పదండి.

Viral Video: అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్.. ఎలా పనిచేస్తుందంటే?
Ai Pigeon Defense System
Anand T
|

Updated on: May 16, 2026 | 3:43 PM

Share

నగరాల్లో ఉండే అపార్ట్‌మెంట్స్‌లో పావురాలు అనేది పెద్ద సమస్య.. ఇవి ఇళ్ల బాల్కనీల్లో పదే పదే గూళ్లు పెడుతూ, దుస్తులను మురికి చేస్తూ జనాలను విసిగిస్తూ ఉంటాయి. ఇలానే వీటితో విసిగిపోయిన ఓ యువకుడు వాటికి ఎలాంటి హాని చేయకుండా, ఈజీగా వాటిని తరిమికొట్టేందుకు సరికొత్త పరికరాన్ని కనిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఓం పటేల్’ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పరికరాన్ని తయారు చేసిన వ్యక్తి తన బాల్కనీలో పావురాలు పదే పదే గూళ్లు పెడుతుండటంతో, వాటిని గుర్తించి తరిమికొట్టేందుకు ఈ ఆటోమేటిక్ వాటర్ గన్‌ను తయారు చేసినట్టు పేర్కొన్నారు. అది ఎలా పనిచేస్తుందో కూడా అతను వివరించాడు.

ఈ పరికరం ఎలా పనిచేస్తుంది?

ఈ ఆటోమేటెడ్ వాటర్ గన్ సిస్టమ్ పూర్తిగా ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది మీ బాల్కనీ పరిసరాలను పర్యవేక్షించడానికి ఒక USB కెమెరాను అమర్చారు. అలాగే కెమెరా రికార్డ్ చేసే లైవ్ వీడియోను AI విజన్ మోడల్ నిరంతరం స్క్రీన్ చేస్తుంది. దీని ద్వారా బాల్కనీలోకి పావురం రాగానే ఈ AI క్షణాల్లో దాన్ని గుర్తిస్తుంది. అలా పావురాన్ని గుర్తించిన వెంటనే, సెర్వో మోటార్లపై అమర్చిన వాటర్ గన్ ఆటోమేటిక్‌గా ఆ పక్షి వైపు తిరిగి, దానిపైకి నీటిని చిమ్ముతుంది. ఆ నీటి జల్లుకు భయపడి పావురాలు అక్కడి నుంచి పారిపోతాయి.

ఈ పరికరం తయారీకి కావాల్సిన టూల్స్

ఈ పరికరం తయారు చేసేందుకు పెద్ద పెద్ద ల్యాబ్‌లు అవసం లేదు, కేవలం ఇంట్లోనే లభించే కొన్ని వస్తువులతో దీన్ని తయారు చేయవచ్చు. ఇందులో ఆరెంజ్ పై 5 మైక్రోకంప్యూటర్, విడదీసిన బ్యాటరీ ఆధారిత వాటర్ గన్, ఒక USB కెమెరా, రెండు సెర్వో మోటార్లు, రెసిస్టర్లు, ఒక ట్రాన్సిస్టర్ ఉపయోగించారు. ఈ డిటెక్షన్ సిస్టమ్ ‘YOLO World V2’ ఆధారంగా రాక్‌చిప్ 3588 (Rockchip 3588) ఇన్‌బిల్ట్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ పై పనిచేస్తుందని అతని పేర్కొన్నారు.

ఏ జంతువునైనా తరిమేయొచ్చు

దీని స్పెషాలిటీ ఏంటంటే దిన్ని ఉపయోగించి పక్షులకు ఎలాంటి హాని చేయకుండా వాటని మీ ఇంట్లో నుంచి తరిమికొట్టవచ్చు. ఇది కేవలం అవి బాల్కనీకి రాకుండా భయపెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే ఈ సిస్టమ్‌లోని ఫ్లెక్సిబిలిటీ నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇది ఓపెన్-వొకాబులరీ AI డిటెక్షన్‌ను ఉపయోగిస్తుంది. అంటే, కేవలం పావురాలే కాకుండా.. మీ బాల్కనీని పాడుచేసే ఉడుతలు, పిల్లులు లేదా ఇతర జంతువులను గుర్తించి తరిమికొట్టేలా కూడా దీన్ని సులభంగా ట్రైన్ చేయవచ్చు.

నెటిజన్ల ప్రశంసలు

సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని పీక్ ఇంజనీరింగ్ బిహేవియర్ అని కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం దయచేసి దీని కమర్షియల్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురండి, మేము కొనుక్కుంటాం అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us