వెల్లుళ్లి వాసన నిజంగానే పాములను తరిమికొడుతుందా?.. నిపుణులు ఏమంటున్నారు.

Anand T

16 may 2026

వేసవి కాలంలో వేడి తట్టుకోలేక పాములు బయటకి రావడం, నివాస ప్రాంతాల్లో సంచరించడం ఎక్కువవుతోంది

పాముల భయం

అయితే ఇలా వేసవిలో పాములు మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి చాలా మంది ఇంటి చుట్టూ వెల్లుల్లి దంచి చల్లుతుంటారు.

వెల్లుల్లి చిట్కా

అయితే, వెల్లుల్లి చల్లడం వల్ల పాములు రావనే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ఇది వారి నమ్మకం మాత్రమే

అశాస్త్రీయమైన పద్ధతి

వెల్లుల్లి వాసనకు పాములు భయపడతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ తెలిపారు.

నిపుణుల ఏమంటున్నారు

వెల్లుల్లి కంటే కూడా ఇంటి పరిసరాల్లో కిరోసిన్  చల్లడం కొంతవరకు ఫలప్రదమని ఆయన పేర్కొన్నారు.

కిరోసిన్ ప్రయోగం

పాములు వచ్చే చోట కిరోసిన్ చల్లితే, అది ఎలుకల వాసనను కప్పివేస్తుందని. దాంతో ఆహారం లేదనుకుని పాములువేరే దారిలోకి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.

కిరోసిన్ ఎలా పనిచేస్తుంది?

పాములు ఇళ్ల వైపు రావడానికి ముఖ్య కారణం ఎలుకలు, కప్పల వంటి వాటిని వేటాడటమేనని తెలిపారు.

వాసన పసిగట్టే నైపుణ్యం

షూస్ వేసుకునే ముందు చెక్ చేసుకోవడం, గ్యాస్ సిలిండర్ల కింద, చీకటి మూలల్లో పాములు దూరకుండా జాగ్రత్తపడటం చాలా అవసరం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు