​ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌

​పబ్​జీ గేమ్ తెస్తోన్న అన‌ర్థాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా టీనేజ్ యువ‌త ఈ గేమ్ మాయంలో ప‌డి త‌మ అమూల్య‌మైన స‌మ‌యాన్ని వేస్ట్ చేసుకుంటుంది.

​ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 25, 2020 | 8:08 AM

​పబ్​జీ గేమ్ తెస్తోన్న అన‌ర్థాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా టీనేజ్ యువ‌త ఈ గేమ్ మాయంలో ప‌డి త‌మ అమూల్య‌మైన స‌మ‌యాన్ని వేస్ట్ చేసుకుంటుంది. కాగా ఈ ఆట కొంత‌మందిని బానిస‌ల్ని చేస్తోంది. ప‌బ్‌జీ ఆడ‌నివ్వ‌క‌పోతే ఆత్మ‌హ‌త్యాయ‌త్నాలు చెయ్య‌డం, త‌ల్లిదండ్రులపై దాడుల‌కు తెగ‌బ‌డ‌టం వంటి ఘ‌ట‌న‌లు అనేకం చూశారం. తాజాగా ప‌బ్‌బీ గేమ్‌కు సంబంధించి మరో వివాదాస్పద ఘటన బయటకు వచ్చింది. పబ్​జీ వ‌ల్ల‌ ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య‌ మొదలైన మాటల యుద్ధం… చివరికి మధ్య రెండు ఫ్యామిలీల‌ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని షమ్లి జిల్లాలో జరిగింది.

జిల్లాలోని హసన్​పుర్​ గ్రామంలో.. అమన్​, విశాల్​ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య పబ్​జీ గేమ్‌కు సంబంధించి వాద‌న జ‌రిగింది. ఇరువురి కుటుంబసభ్యులు కూడా ఇందులో జోక్యం చేసుకున్నారు. అది కాస్తా ముదిరి చివ‌రికి ఘర్షణకు దారి తీసింది. ఇరువైపుల వారు లాఠీలు, తుపాకులతో హింసకు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో గాయపడ్డ ఐదుగురిని ఆజ తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా.. ఘటనాస్థలం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించినట్టు పేర్కొన్నారు.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

కొవిడ్ డెడ్‌బాడీల‌ను తీసుకెళ్లే అంబులెన్సులకు ఛార్జీలు ఫిక్స్