ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం కేసులో నలుగురు అరెస్ట్..నిందితుల్లో ఓ పార్టీ నేత, కానిస్టేబుల్
గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలకల్‌కు చెందిన వైసీపీ నాయకుడు దామోదర రెడ్డిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులలో ఒకరు ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. తవ్వకాలుగా వినియోగించిన ప్రొక్లైన్ పోలకల్‌కు చెందినదిగా గుర్తించారు. కేసును నీరుగార్చేందుకు పోలీసులపై అధికారపార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే :
కర్నూలు జిల్లాలో ఇటీవల గుప్తనిధుల వేట కలకలం రేపింది. గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు పెకలించారు. పొన్నకల్లు గ్రామంలో వందేళ్ల చరిత్ర గల శ్రీ దాస్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. గుప్తనిధుల కోసం గుంతలు తవ్వి విగ్రహాలను చిందరవందరగా పడేశారు. హనుమాన్ విగ్రహం ధ్వంసంపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోడ్డుపై బైఠాయించి ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
Also Read :
Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు
Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్
