తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరుగుతోన్న కేసులు..కొత్త టెన్ష‌న్ ఏంటంటే..?

తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరుగుతోన్న కేసులు..కొత్త టెన్ష‌న్ ఏంటంటే..?

తెలంగాణలో క‌రోనా మ‌ళ్లీ వీర‌విహారం చేస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు సింగిల్ డిజిట్ లో మాత్రమే కేసులు న‌మోదవ్వ‌గా..ఇప్పుడు డేంజ‌ర‌స్ వైర‌స్ మ‌ళ్లీ క‌ల‌క‌లం రేపుతోంది. రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 26 మందికి కోవిడ్-19 సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా సోక‌గా.. రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1196కు చేరింది. ఇప్పటి వరకు 751 […]

Ram Naramaneni

|

May 10, 2020 | 10:07 PM

తెలంగాణలో క‌రోనా మ‌ళ్లీ వీర‌విహారం చేస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు సింగిల్ డిజిట్ లో మాత్రమే కేసులు న‌మోదవ్వ‌గా..ఇప్పుడు డేంజ‌ర‌స్ వైర‌స్ మ‌ళ్లీ క‌ల‌క‌లం రేపుతోంది. రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 26 మందికి కోవిడ్-19 సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా సోక‌గా.. రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1196కు చేరింది. ఇప్పటి వరకు 751 మంది వ్యాధి న‌య‌మై ఆస్ప‌త్రుల నుంచి ఇళ్లకు వెళ్లగా.. వివిధ ఆస్పత్రుల్లో 415 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. కరోనా ప్ర‌భావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 30 మంది మృతి చెందారు.

ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేని యాదాద్రి భువనగిరి జిల్లాలో మొద‌టిసారిగా కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లాలో ఆదివారం న‌లుగురికి క‌రోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. దీంతో అధికారుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఇప్పుటికే జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అధికారుల‌కు క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu