గిరిజనుల మేలు చేకూర్చేలా సీఎం జగన్ కీలక నిర్ణయం…
గిరిజనులకు మేలు చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఎస్టీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెచ్చిన జీవోను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది. అయితే ఆ తీర్పు వల్ల గిరిజన వర్గాల్లో కాస్త ఆందోళన చెలరేగింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు… ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన జగన్.. గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై […]

గిరిజనులకు మేలు చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఎస్టీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెచ్చిన జీవోను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది. అయితే ఆ తీర్పు వల్ల గిరిజన వర్గాల్లో కాస్త ఆందోళన చెలరేగింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు… ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన జగన్.. గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌తో సీఎం రివ్యూ జరిపారు. సుప్రీం కోర్టు తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసి…గిరిజనులకు న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రిలీజ్ చేసిన జీవో కావడం వల్ల తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల తెలంగాణ గవర్నమెంట్ తో సమన్వయం చేసుకుని ముందడుగు వేయాలని సీఎం ఆదేశించారు.
