అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎవ్వరికీ ఏం కాలేదు..!

అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎవ్వరికీ ఏం కాలేదు..!

విలక్షణ నటుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం విరాట పర్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నీది నాది ఒకే కథ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2020 | 9:25 PM

విలక్షణ నటుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం విరాట పర్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నీది నాది ఒకే కథ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. నందితా దాస్‌, ప్రియమణి, నవీన్‌ చంద్ర, ఈశ్వరీ రావు, సాయి చంద్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనను తాజాగా రానా అభిమానులతో పంచుకున్నారు.

విరాట పర్వం కోసం కేరళ అడవుల్లో షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలో అనుకోకుండా మా వైపు 20 ఏనుగులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు ఆ ఘటనలో ఎవ్వరికీ ఏం కాలేదు. ఆ తరువాత అందరం సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాం అని తెలిపారు. కాగా ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. మహానటి ఫేమ్ డేని షాంచేజ్‌ లోపేజ్‌, దివాకర్‌ మణి సినిమాటోగ్రాఫర్‌లుగా పనిచేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవల వచ్చిన సాయి పల్లవి ఫస్ట్‌లుక్ అందరినీ తెగ ఆకట్టుకోగా.. సినిమాపై అంచనాలు పెరిగాయి.

Read This Story Also: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా.. 28 మందికి కరోనా పాజిటివ్..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu