16 గంటల ఆపరేషన్ సక్సెస్, బాలుడు క్షేమం

మహారాష్ట్రలో బోరు బావిలో బాలుడు పడిపోయిన విషయం విదితమే. పూణె జిల్లా అంబెగావ్ గ్రామంలో పొలంలో సాగునీటి కోసం తవ్విన 200 అడుగుల లోతు బోరుబావిలో 6 సంవత్సరాల బాలుడు పడ్డాడు. పొలంలో ఆడుకుంటుండగా బోరు బావిలో పడిపోయాడు. ఆ బాలుడు 10 అడుగుల లోతులో చిక్కుకోగా.. 16 గంటల పాటు తీవ్రంగా శ్రమించి.. రాత్రంతా బోరు బావిలోకి ఆక్సిజన్ పంపుతూ సమాంతరంగా గొయ్యిని తవ్వారు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది. అనంతరం పిల్లాడిని సురక్షితంగా బయటకు తీశారు. మరోవైపు […]

16 గంటల ఆపరేషన్ సక్సెస్, బాలుడు క్షేమం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:22 PM

మహారాష్ట్రలో బోరు బావిలో బాలుడు పడిపోయిన విషయం విదితమే. పూణె జిల్లా అంబెగావ్ గ్రామంలో పొలంలో సాగునీటి కోసం తవ్విన 200 అడుగుల లోతు బోరుబావిలో 6 సంవత్సరాల బాలుడు పడ్డాడు. పొలంలో ఆడుకుంటుండగా బోరు బావిలో పడిపోయాడు. ఆ బాలుడు 10 అడుగుల లోతులో చిక్కుకోగా.. 16 గంటల పాటు తీవ్రంగా శ్రమించి.. రాత్రంతా బోరు బావిలోకి ఆక్సిజన్ పంపుతూ సమాంతరంగా గొయ్యిని తవ్వారు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది. అనంతరం పిల్లాడిని సురక్షితంగా బయటకు తీశారు. మరోవైపు తమ కుమారుడు సురక్షితంగా బయటపడటంతో పిల్లాడి తల్లిదండ్రులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడనీ, ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు అన్నారు.