AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించిన ఢిల్లీ ఆటగాళ్లు

కోల్‌కతాతో జరిగిన కీ ఫైట్ ‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. కోల్‌కతా బౌలర్లను  ఢిల్లీ ఆటగాళ్లు ఆటాడుకున్నారు. బ్యాట్స్‌మెన్‌ తమదైన శైలిలో చెలరేగుతూ పరుగుల వర్షం కురిపించారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 88 పరుగులతో..

కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించిన ఢిల్లీ ఆటగాళ్లు
Sanjay Kasula
|

Updated on: Oct 03, 2020 | 10:01 PM

Share

కోల్‌కతాతో జరిగిన కీ ఫైట్ ‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. కోల్‌కతా బౌలర్లను  ఢిల్లీ ఆటగాళ్లు ఆటాడుకున్నారు. బ్యాట్స్‌మెన్‌ తమదైన శైలిలో చెలరేగుతూ పరుగుల వర్షం కురిపించారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 88 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 38 బంతుల్లో 7ఫోర్లు, 6సిక్సర్లు చెరలేగిపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ అదిరిపోయింది. పృథ్వీ షా(66/41 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపులతో ఆఫ్ సెంచరీలతో దూకుడు ప్రదర్శించారు. రిషబ్‌ పంత్‌ (38/ 17 బంతుల్లో 5ఫోర్లు,సిక్స్‌ ) హిట్టింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ 4 వికెట్లకు పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్‌(2/29) ఒక్కడే ఢిల్లీని కట్టడి చేశాడు. మిగతా బౌలర్లందరూ ప్రతీ ఓవర్‌లో 12కు పైగా రన్స్‌ సమర్పించుకున్నారు.

Follow Us