Personality Test: మీ పాదం ఏ షేప్‌లో ఉంది.? దానిబట్టి మీరెలాంటి వారో చెప్పొచ్చు
మన ముఖకవలికలు, మన శరీర భాగాల ఆకారం ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చని మానసిక నిపుణులు అంచనా వేస్తుంటారు. దీనినే పర్సనాలిటీ టెస్ట్‌గా అభివర్ణిస్తుంటారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి అంశాలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ పర్సనాలిటీ టెస్ట్ ఫొటో నెట్టింట గతె ట్రెండ్ అవుతోంది...
మన ముఖకవలికలు, మన శరీర భాగాల ఆకారం ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చని మానసిక నిపుణులు అంచనా వేస్తుంటారు. దీనినే పర్సనాలిటీ టెస్ట్‌గా అభివర్ణిస్తుంటారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి అంశాలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ పర్సనాలిటీ టెస్ట్ ఫొటో నెట్టింట గతె ట్రెండ్ అవుతోంది.
ఈ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా మనిషి పాదం ఎలాంటిదో అంచనా వేయొచ్చని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనిషి పాదం రెండు రకాలుగా ఉంటుంది. పాదాన్ని పూర్తిగా నేలకు ఆనించిన సమయంలో పాదం కింద వంపు ఉన్న వారు కొందరైతే, ఫ్లాట్‌గా ఉండే వారు మరి కొందరు. ఇలా ఈ పాదం ఆకారం ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పైన ఉన్న ఫొటోలో ఉన్న మొదటి పాదం ఆకారం మాదిరిగా.. ఫ్లాట్‌గా ఉంటే వారు ఒకటి కంటే ఎక్కువ విషయాలను ఒకేసారి ఆలోచించగలుగుతారు. వీరు తరచుగా భావోద్వేగ సంబంధాలను కోరుకుంటారు. ఇతరుల సహవాసాన్ని ఆనందిస్తారు. ఇతరులతో త్వరగా స్నేహం చేస్తారు. పాజిటివ్ ఆలోచనతో ఉంటారు. స్వతంత్ర భావాలతో ఆలోచిస్తారని అర్థం. స్వతంత్ర ఆలోచనతో ఉంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ ఫొటోలో ఉన్న విధంగా వంపు ఆకారం పాదం ఉన్న వారు దూరదృష్టి గల మనస్తత్వంతో స్వతంత్ర ఆలోచనాపరులుగా ఉంటారని అర్థం. తరచుగా ఆత్మపరిశీలన చేసుకుంటారు. సమస్యలను స్వీకరిస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆలోచనతో ఉంటారు. జీవితంపట్ల నిత్యం సానుకూల దృక్పథంతో ఉంటారు. అయితే కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..