Horoscope Today: వారు ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు, డబ్బు తీసుకోవద్దు.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 9, 2024): మేష రాశి వారికి ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. వృషభ రాశి వారికి కొత్త అవకాశాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు, డబ్బు తీసుకోవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారు ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు, డబ్బు తీసుకోవద్దు.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 09th October 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 09, 2024 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 9, 2024): మేష రాశి వారికి ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. వృషభ రాశి వారికి కొత్త అవకాశాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు, డబ్బు తీసుకోవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లోనే అధికారులు భారీ లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబపరంగా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలుండే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కొత్త అవకాశాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరు ద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా ఒకటి రెండు ధన యోగాలు పడతాయి. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజికంగా ప్రాధా న్యం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు, డబ్బు తీసుకోవద్దు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఇంటా బయటా కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్య తలు మీద పడడం జరుగుతుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది కానీ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): సంపాదన విషయంలో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగి పోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి, వేతనాల పెరుగుదలకు సంబంధించి అనుకోని శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. బంధువుల సహకారంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదు. మంచి పరిచయాలు కలుగుతాయి.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవ రినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అదనపు ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ వాతా వరణం సానుకూలంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు బంధువులకు సహాయం చేస్తారు.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు చాలావరకు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపో తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగు తాయి. ముఖ్యమైన వ్యవహారాలను జీవిత భాగస్వామి సహాయంతో పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు, బాకీలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో అదికారులకు మీ మీద నమ్మకం, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు దూసుకుపోతాయి. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆలయాలకు వెళ్లి దైవ కా ర్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశం కూడా ఉంది. నిరుద్యో గులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలుంటాయి. శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరిగి ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవు తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలను సంద ర్శిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ బాగా పెరుగుతుంది. మానసికంగా కూడా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వ్యక్తి గత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా ముందుకు వెడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అధికారులు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. నిరుద్యోగులకు సరికొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబసమేతంగా కొన్ని ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో