Dussehra Astrology: 4 గ్రహాల అనుకూలత.. దీపావళి వరకు ఆ రాశుల వారికి శుభ యోగాలు..!
ఈ నెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అంటే విజయ దశమి నుంచి దీపావళి వరకు, శని, గురు, శుక్ర, బుధులు కొన్ని రాశులకు శుభ యోగాలను, శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశులవారి కుటుంబాల్లో అసలు సిసలు పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.నాలుగు గ్రహాలు ఏక కాలంలో శుభప్రదంగా మారడం ఒక అరుదైన విశేషం. దీనివల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం, ఆదాయ ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనివ్వడం..
ఈ నెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అంటే విజయ దశమి నుంచి దీపావళి వరకు, శని, గురు, శుక్ర, బుధులు కొన్ని రాశులకు శుభ యోగాలను, శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశులవారి కుటుంబాల్లో అసలు సిసలు పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ నాలుగు గ్రహాలు ఏక కాలంలో శుభప్రదంగా మారడం ఒక అరుదైన విశేషం. దీనివల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం, ఆదాయ ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనివ్వడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి.
- మేషం: ఈ రాశికి ఇప్పటికే శని, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉండగా, బుధ, శుక్రుల అనుకూలత కూడా లభించడం వల్ల అనేక మార్గాల్లో సంపద బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ నాలుగు గ్రహాలు సంపదకు చెందిన గ్రహాలే అయినందువల్ల ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు పదోన్నతులు లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు బాగా అనుకూలిస్తాయి.
- వృషభం: ఈ రాశిలో గురువు మరింత సానుకూల సంచారం చేయడంతో పాటు శని, బుధ, శుక్రులు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల ఆదాయ వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అదనపు సంపాదనకు అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టడం వల్ల ఆర్థింగా పురోగతి చెందుతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభి స్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయం సాధిస్తాయి.
- కర్కాటకం: ఈ రాశికి అష్టమ శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. శుభగ్రహాలైన గురు, బుధ, శుక్రులు నెలా ఖరు వరకు పూర్తిగా అనుకూలంగా మారుతున్నాయి. ఫలితంగా అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరగడమే కాకుండా, అదనపు ఆదాయ ప్రయ త్నాలు కూడా లాభదాయక ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.
- తుల: ఈ రాశికి అష్టమంలో సంచారం చేస్తున్న గురువు సైతం వక్రగతి వల్ల శుభుడుగా మారడం జరు గుతోంది. ఈ నాలుగు గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశివారికి సర్వత్రా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి.
- ధనుస్సు: రాశ్యధిపతి గురువు వక్రించడం వల్ల ఈ రాశివారికి ఆదాయపరంగా అనేక శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది. శని, బుధ, శుక్రుల బలం వల్ల వీరికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల బాగా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వాలు లభిస్తాయి. అన్ని విధాలుగానూ పురోగతి ఉంటుంది.
- మకరం: ఈ రాశికి శని, గురువుల అనుకూలతలతో పాటు బుధ, శుక్రుల అనుకూలతలు కూడా కలిగి నందువల్ల కుటుంబంలో అనేక విధాలుగా పండుగ వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేప ట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.