Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్‌ లోని చిన్నారి ఎవరు..? ఆమెకు స్వాతంత్య్ర ఉద్యమంతో ఉన్న అనుబంధం ఏంటి..?

పిల్లల నుంచి పెద్దల వరకు టీ లేదా కాఫీతో పాటు తినేందుకు అందరికీ ఎంతో ఇష్టమైన బిస్కెట్ అంటే పార్లే జీ. ఈ బిస్కెట్ ప్యాకెట్‌ పై ఉండే చిన్నారి ముఖం చాలా మందికి గుర్తుండేలా ఉంటుంది. ముద్దుగా నవ్వుతూ కనిపించే ఆ ముఖాన్ని మనం చిన్ననాటి నుంచే చూస్తున్నాం. ఆ ముఖం వెనుక ఉన్న చిన్నారి నిజంగా ఎవరు..? ఆ చిత్రానికి స్వాతంత్య్ర ఉద్యమంతో ఏమైనా సంబంధం ఉందా..? ఈ ఆసక్తికరమైన విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్‌ లోని చిన్నారి ఎవరు..? ఆమెకు స్వాతంత్య్ర ఉద్యమంతో ఉన్న అనుబంధం ఏంటి..?
Parle G
Follow us
Prashanthi V

|

Updated on: Jun 11, 2025 | 8:18 PM

పాత తరాలవారు మొదలుకొని ఇప్పటి చిన్నారుల వరకూ అందరూ ఇష్టపడే బిస్కెట్ ఇది. కొన్ని దశాబ్దాల క్రితం రెండు రూపాయలకే దొరికిన ఈ బిస్కెట్‌ ప్యాకెట్.. ఇప్పటికీ మూడు లేదా ఐదు రూపాయల ధరలో చిన్న ప్యాకెట్లు దొరుకుతుంటాయి. సాధారణంగా బిస్కెట్ ప్యాకెట్లు చింపడంలో మనకు ఏ సందేహం ఉండదు. కానీ పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ మాత్రం చాలా జాగ్రత్తగా తెరిచేవారు.. ప్యాకెట్ మీద ఉన్న ఆ చిన్నారి ముఖాన్ని చించాలన్న ఆలోచనే కలగదు. అలాంటి ముద్దైన చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ.. ఈ చిన్నారి ఎవరు..? అనే ప్రశ్న మాత్రం సహజంగా కలుగుతుంది.

పార్లే జీ బిస్కెట్లు 1939 నుండి మార్కెట్‌ లో ఉన్నాయి. మొదట ఇవి పార్లే గ్లూకో అనే పేరుతో విడుదలయ్యాయి. అయితే 1990లలో మొదటిసారి చిన్నారి చిత్రం ప్యాకెట్‌ పై ముద్రించబడింది. అప్పటి నుంచి ఇప్పటికీ అదే ముఖం ప్యాకెట్‌పై ఉంటోంది. ముద్దుగా నవ్వుతూ ఉండే ఈ ముఖం ఎంతో మందిని ఆకట్టుకుంది.

ఈ చిన్నారి ముఖం గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. కొంతమంది ఆమె పేరు నీరూ దేశ్‌ పాండే అంటుండగా, మరికొంతమంది ఆమె సుధా మూర్తి లేదా గుంజన్ కుందనియా అని చెబుతారు. ఒకసారి నాగ్‌ పూర్‌ కు చెందిన ఓ ఫోటోగ్రాఫర్‌ తన కుమార్తె ఫోటోను పార్లే కంపెనీకి ఇచ్చాడని వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఈ విషయంలో 2023లో పార్లే సంస్థ ప్రతినిధి మయాంక్ షా ఒక కీలక సమాచారం ఇచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం నిజంగా ఎవరి ఫోటో ఆధారంగా కూడా కాదు. ఇది 1960లో ఒక ఆర్టిస్టు సృజనాత్మకతతో ఊహించి రూపొందించిన కల్పిత చిత్రం మాత్రమే అని స్పష్టం చేశారు.

పార్లే కంపెనీ 1929లో మొదలైంది. మొదట తీపి పదార్థాలు తయారు చేసేవారు. 1938లో బిస్కెట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. బ్రిటిష్ కాలంలో బిస్కెట్లు ప్రధానంగా విదేశీ కంపెనీల చేతుల్లో ఉండేవి. అందరికీ అందుబాటులో ఉండే భారతీయ బ్రాండ్ కావాలనే లక్ష్యంతో.. పార్లే సంస్థ తమ సొంతంగా బిస్కెట్లు తయారు చేసింది. మహాత్మా గాంధీ ప్రవేశపెట్టిన స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా పార్లే గ్లూకోను భారతీయులకు అందించారు. తర్వాత G అంటే గ్లూకో స్థానంలో జీనియస్ అనే అర్థంతో వ్యాఖ్యానించారు.

నేటి మార్కెట్‌ లో అనేక రకాల బిస్కెట్లు దొరుకుతున్నా.. ఎక్కువ మంది సాధారణ ప్రజలు ఇప్పటికీ పార్లే జీ బిస్కెట్లనే ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక బిస్కెట్‌ మాత్రమే కాదు.. తరాల అనుబంధాన్ని గుర్తు చేసే ఓ భావోద్వేగ చిహ్నంగా మారింది.