Aghora: అఘోరాలు ఎవరు? వారు శవాలతో సహవాసం ఎందుకు చేస్తారు..?
అఘోరా అంటే సాధు జీవనంలోనే ఉన్నతమైన స్థితిగా వారు అభివర్ణిస్తూ ఉంటారు. వీరు బేధభావాలను నమ్మరు. వీరి పట్ల హిందూ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. కుంభమేళాలు, పుష్కరాలలో మాత్రమే వీరు ఎక్కువగా కనిపిస్తుంటారు.

అఘోరాలు ఎవరు? ఈ ప్రశ్న చాలామందికి చిక్కుముడే. వారు ఎప్పుడూ స్మశానాల్లోనే తిరుగుతూ ఉంటారు. కాలే కాష్టాల మధ్య కాలం వెళ్లదీస్తూ ఉంటారు. మనుషుల పుర్రెలను పట్టుకుని సంచరిస్తూ ఉంటారు. దాన్ని ఒక పాత్రగా వివిధ పనులకు ఉపయోగిస్తారు. శరీరమంతా బూడిద ఉంటుంది.. ఒంటిపై వస్త్రాలు ఉండవు. మెడలో రుద్రాక్ష మాలలు ధరిస్తారు. శివుడ్ని అమితంగా ఆరాధిస్తారు. గంజాయి తాగుతూ కనిపిస్తూ ఉంటారు. శవాలపై కూర్చుని ధ్యానం చేస్తుంటారు. వీరికి మంచీ చెడులు ఒక్కటే. బాహ్య ప్రపంచానికి చాలా ఎడం పాటిస్తూ ఉంటారు. కుంభమేళా జరిగేటప్పుడో లేదా దేవాలయాల్లో ఏవైనా ప్రత్యేక పూజలు సమయంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంతాలకు తరలివస్తూ ఉంటారు. సంస్కృతంలో అఘోరీ అంటే ‘భయం కలిగించని’ అని అర్థం కానీ. కానీ అఘోరాల వేషధారణ, ప్రవర్తన భీతిగొల్పుతూ ఉంటుంది. హిందూ సమాజంలో వీరిని దేవ ధూతలుగా భావిస్తారు. అఘోరాల్లో పురుషులే ఉంటారు. మహిళలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. దేవునితో ఏకం కావడానికి వీరు సాధారణ నియమాలను దాటి తమదైన ప్రత్యేక పద్ధతులను అవలంభిస్తారు. మన దేశంలో ఎంతమంది అఘోరాలు ఉన్నారన్న అంశంపై స్పష్టత లేదు కానీ వేలల్లో ఉండొచ్చని ఓ అంచనా.
అఘోరాల్లో కొందరు నరమాంసాన్ని భక్షిస్తారు. మృతదేహాలతో సంభోగిస్తామని కొందరు చెబుతుంటారు. కొందరు వేశ్యలతో శృంగారంలో పాల్గొంటారు. కానీ స్వలింగ సంపర్కాన్ని అస్సలు ఆమోదించరు. వీరిలో కొందరికి కామరూప, పరకాయ ప్రవేశ విద్యలు కూడా వచ్చు అంటుంటారు. నాలుగు వందల ఏళ్ల క్రితం వారణాసిలో జీవించిన బాబా కీనారం అనే సాధువుల పరంపరగా ఇప్పటి అఘోరాలు అనే ఓ కథ ప్రచారంలో ఉంది. వీరు తమ జీవిత కాలమంతా మోక్ష సాధన లక్ష్యంగా ధ్యానంలో ఉంటారు. అతి జుగుప్సాకరమైన పద్దతిన వీరు మోక్ష సాధన మార్గం ఉంటుంది. హిమాలయ మంచు గుహలు, కాశీ క్షేత్రం, బెంగాల్, గుజరాత్ అడవుల్లో వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




