Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parle G: ‘పార్లే-జి’లో ‘జి’ అంటే ఏమిటి..? బిస్కెట్‌ ప్యాకెట్‌పై కనిపించే పిల్లవాడు ఎవరు.. క్లారిటి ఇచ్చిన కంపెనీ..!

Parle G: 'మీరు ఎప్పుడో ఒకసారి పార్లే-జిని తిని ఉంటారు. ఈ బిస్కెట్‌ ఎన్నో ఏళ్ల నుంచి ఫేమస్‌గా ఉంది. కానీ ఆ బిస్కెట్‌ ప్యాకెట్‌కు ప్లార్లే-జీ అలా ఎందుకు పేరు పెట్టారని మీరు..

Parle G: 'పార్లే-జి'లో 'జి' అంటే ఏమిటి..? బిస్కెట్‌ ప్యాకెట్‌పై కనిపించే పిల్లవాడు ఎవరు.. క్లారిటి ఇచ్చిన కంపెనీ..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 31, 2021 | 8:33 AM

Parle G: ‘మీరు ఎప్పుడో ఒకసారి పార్లే-జిని తిని ఉంటారు. ఈ బిస్కెట్‌ ఎన్నో ఏళ్ల నుంచి ఫేమస్‌గా ఉంది. కానీ ఆ బిస్కెట్‌ ప్యాకెట్‌కు ప్లార్లే-జీ అలా ఎందుకు పేరు పెట్టారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ బిస్కెట్ తయారీదారు ఫ్యాక్టరీ ముంబైలోని విలే పార్లేలో ప్రారంభించబడిందని, అందుకే దాని పేరులో పార్లే అని చాలా మంది సమాధానం ఇస్తారు. అయితే ‘పార్లే-జి’లో ‘జి’ అంటే ఏమిటి..? ప్యాకెట్‌పై కనిపిస్తున్న చిన్నారి ఎవరు..? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది.

పార్లే-జి పార్లేజ్-గ్లూకోజ్‌తో తయారు చేయబడింది. పార్లే ఉత్పత్తులు 1929లో స్థాపించబడ్డాయి. అప్పుడు అక్కడ 12 మంది మాత్రమే పని చేసేవారు. 1938లో మొదటిసారి బిస్కెట్‌ను తయారు చేశారు. బిస్కెట్‌కి పార్లేజ్-గ్లూకో అని పేరు పెట్టారు. 80వ దశకం ప్రారంభం వరకు దీని పేరు అలాగే ఉంది. కానీ 1981లో కంపెనీ పార్లేజ్-గ్లూకోను కేవలం ‘G’గా మార్చింది. ఈ ‘G’ అంటే గ్లూకోజ్. 80వ దశకంలో ఈ బిస్కెట్ పిల్లల నుండి పెద్దల వరకు ప్రాచుర్యం పొందింది. పిల్లలకు నచ్చడంతో కంపెనీ ఈ ‘జీ’ పదాన్ని జీనియస్‌గా మార్చింది. అయితే ప్యాకెట్‌పై పార్లే-జి అని రాసి ఉంది.

ప్యాకెట్‌పై కనిపిస్తున్న పిల్లవాడు ఎవరు..? పార్లే-జి ప్యాకెట్‌పై ఓ చిన్నారి కనిపించింది. బిస్కెట్‌ను విడుదల చేసి అనేక దశాబ్దాలు గడిచినా.. ప్యాకింగ్‌పై కనిపించే పిల్లవాడు ఎవరనే దానిపై అనేక వాదనలు ఉన్నాయి. కానీ మూడు పేర్లు సర్వసాధారణంగా మిగిలిపోయాయి. వీరిలో నీరూ దేశ్‌పాండే, సుధా మూర్తి మరియు గుంజన్ గుండానియా ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరి చిన్ననాటి చిత్రం బిస్కెట్ ప్యాకెట్‌పై ఉందని భావిస్తున్నారు. వీటిలో నీరూ దేశ్‌పాండే పేరుకు సంబంధించి పేరు ప్రముఖంగా వినిపించేది. చాలా వార్తాపత్రికల్లో కూడా నీరూ దేశ్‌పాండే ఫొటోతో వార్తలు కూడా వచ్చాయి. ఈ చిత్రం నాగ్‌పూర్ నివాసి 65 ఏళ్ల నీరూ చిన్ననాటిదని పలు మీడియా కథనాలు కూడా వచ్చాయి. నీరూ ఈ చిత్రాన్ని ఆమె 4 సంవత్సరాల వయస్సులో తీశారని వార్తలు వచ్చాయి. అతని తండ్రి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి అతను ఇలా ఫోటో తీశాడని చెబుతుంటారు. అది పార్లే-జి ప్యాకింగ్ కోసం తీసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ వార్త వైరల్ కావడంతో పార్లే ప్రొడక్ట్స్ నుండి స్పందన వచ్చింది. ఇందుకు సంబంధించిన అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది కంపెనీ. పార్లే ప్రొడక్ట్స్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మయాంక్ షా వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చేశారు. పార్లే బిస్కెట్‌ ప్యాకెట్‌పై కనిపించే పిల్లవాడు ఒక ఉదాహరణ మాత్రమేనని, ఇది ఎవ్వరి ఫోటో కాదని, ఈ ఫోటోను ఎవరెస్ట్ క్రియేటివ్ ఏజెన్సీ తయారు చేసిందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Diabetes: డయాబెటిస్‌ బారిన పడేవారు అధికంగా పురుషులే.. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో కీలక విషయాలు

Papaya Benefits: బొప్పాయితో అదిరిపోయే ప్రయోజనాలు.. బెనిఫిట్స్‌ ఎంటో తెలిస్తే షాకవుతారు..!

కదులుతున్న రైల్లో సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. సీన్‌ కట్‌చేస్తే దొంగ
కదులుతున్న రైల్లో సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. సీన్‌ కట్‌చేస్తే దొంగ
మార్స్‌పై మనిషి బతికేందుకు సరికొత్త మార్గం కనిపెట్టిన సైంటిస్ట్‌!
మార్స్‌పై మనిషి బతికేందుకు సరికొత్త మార్గం కనిపెట్టిన సైంటిస్ట్‌!
వాట్సాప్‌ కీలక అప్‌డేట్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్!
వాట్సాప్‌ కీలక అప్‌డేట్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్!
శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటినుంచి 3రోజుల పాటు పలుసేవలకు బ్రేక్
శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటినుంచి 3రోజుల పాటు పలుసేవలకు బ్రేక్
ఇదేం రీల్స్‌ పిచ్చిరా సామి.. కొంచెం తేడా జరిగినా అంతే పరిస్థితి!
ఇదేం రీల్స్‌ పిచ్చిరా సామి.. కొంచెం తేడా జరిగినా అంతే పరిస్థితి!
ఐపీఎల్ లో కులం ప్రస్తావన.. నెటిజన్ల ఆగ్రహం
ఐపీఎల్ లో కులం ప్రస్తావన.. నెటిజన్ల ఆగ్రహం
నిశీధిలో ఉషోదయంలా అందాల రాశి..
నిశీధిలో ఉషోదయంలా అందాల రాశి..
విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను వెనక్కి రప్పించేదీ ఎలా?
విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను వెనక్కి రప్పించేదీ ఎలా?
క్యాన్సర్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌! తక్కువ ఖర్చుతోనే..
క్యాన్సర్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌! తక్కువ ఖర్చుతోనే..
వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..
వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..