Smart phone: మీ ఫోన్‌లో మీకే తెలియని రహస్యాలు.. ఈ సీక్రెట్ కోడ్స్‌తో తెలుసుకోవచ్చు.

బ్యాంక్‌ పనుల నుంచి ఫ్లైట్ టికెట్ సినిమా బుకింగ్స్‌ వరకు ఇలా అన్ని రకాల పనులు స్మార్ట్‌ ఫోన్‌తోనే చేసే రోజులు వచ్చేశాయ్‌. అరచేతిలో ఇమిడే ఈ గ్యాడ్జెట్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇదిలా ఉంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్‌లో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. కొన్ని కోడ్స్‌ ఆధారంగా మన ఫోన్‌లోని ఇంట్రెస్టింగ్‌ విషయాలను తీసుకోవచ్చు. ఇంతకీ ఆ కోడ్స్‌ ఏంటంటే..

Smart phone: మీ ఫోన్‌లో మీకే తెలియని రహస్యాలు.. ఈ సీక్రెట్ కోడ్స్‌తో తెలుసుకోవచ్చు.
Smartphone Hacks
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 23, 2023 | 12:40 PM

ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ ఫోన్‌ అనివార్యంగా మారిపోయింది. ఒకే ఇంట్లో రెండుకు మించి ఫోన్‌లు ఉండే పరిస్థితి ఉంది. బ్యాంక్‌ పనుల నుంచి ఫ్లైట్ టికెట్ సినిమా బుకింగ్స్‌ వరకు ఇలా అన్ని రకాల పనులు స్మార్ట్‌ ఫోన్‌తోనే చేసే రోజులు వచ్చేశాయ్‌. అరచేతిలో ఇమిడే ఈ గ్యాడ్జెట్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇదిలా ఉంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్‌లో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. కొన్ని కోడ్స్‌ ఆధారంగా మన ఫోన్‌లోని ఇంట్రెస్టింగ్‌ విషయాలను తీసుకోవచ్చు. ఇంతకీ ఆ కోడ్స్‌ ఏంటంటే..

1) *#*#4636#*#*: కోడ్‌ను ఫోన్‌లో ఎంటర్‌ చేయడం ద్వారా మీ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ కోడ్‌ ద్వారా బ్యాటరీ, వైఫై ఇన్ఫర్మేషన్‌, యాప్స్ ఉపయోగానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

2) మీ స్మార్ట్ ఫోన్‌లో కాల్స్‌ లేదా మెసేజ్‌లు మరో నెంబర్‌కు డైవర్ట్ చేశాయో తెలుసుకోవడానికి ఒక కోడ్‌ అందుబాటులో ఉంది. *#21# కోడ్‌ సహాయంతో ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.

3) ఒకవేళ మీ కాల్స్‌ కానీ, మెసేజ్‌లు కానీ ఇతర నెంబర్లకు ఫార్వర్డ్‌ చేసి ఉంటే.. ##002# కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా క్యాన్సెల్‌ చేసుకోవచ్చు. ఈ కోడ్‌ను ఎంటర్‌ చేస్తే ఈ మీకాల్స్‌ ఫార్వర్డ్ ఉంటే వెంటనే డీయాక్టివ్‌అవుతాయి.

4) *43# కోడ్‌ సహాయంతో మీ ఫోన్‌లో కాల్‌ వెయిటింగ్ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఎవరైనా కాల్ చేస్తే వెయింట్ వస్తుంది. అలాగే దీనిని డీయాక్టివేట్ చేసుకోవాలంటే #43# కోడ్‌ని ఎంటర్ చేస్తే సరిపోతుంది.

5) ఇక మీ ఫోన్‌ ఐఎమ్‌ఈఐ నెంబర్‌ తెలుసుకోవాలంటే *#06# కోడ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా మీ ఫోన్‌కు సంబంధించిన ఐఎమ్‌ఈఐ నెంబర్‌తో పాటు పూర్తి వివరాలు పొందొచ్చు.

నోట్‌: పైన తెలిపిన వివరాలు కొన్ని వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. అయితే ఈ కోడ్‌లు సరిగ్గా సపోర్ట్ చేయని ఫోన్‌లు, టెక్నికల్‌గా పాడయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తించాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..