Headache: ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుందా.? మీకు ఈ ప్రమాదం ఉన్నట్లే..
మరీ ముఖ్యంగా ఉయదం లేవగానే చాలా మందికి తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఉదయం లేవగానే విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు. తల బద్దలయ్యేలా నొప్పి ఉంటుంది. తలనొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. నిద్రలేమి మొదలు, డీ హైడ్రేషన్ వరకు ఎన్నో కారణాలు తలనొప్పికి కారణమవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ తలనొప్పికి...

తలనొప్పి సర్వ సాధారణంగా ఎదురయ్యే సమస్య. మనలో చాలా మందికి తలనొప్పి సమస్య ఎప్పుడో ఒకసారి వేధిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉయదం లేవగానే చాలా మందికి తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఉదయం లేవగానే విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు. తల బద్దలయ్యేలా నొప్పి ఉంటుంది. తలనొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. నిద్రలేమి మొదలు, డీ హైడ్రేషన్ వరకు ఎన్నో కారణాలు తలనొప్పికి కారణమవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ తలనొప్పికి గల పలు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఉదయం నిద్రలేవగానే తలనొప్పికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. రాత్రిపూట సరిపడ నీరు తాగకుండా నిద్రపోతే ఇలాంటి సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రాత్రి పూట ఆల్కహాల్ సేవించినా, సరిపడ నీర తాగకపోయినా ఉదయం లేవగానే విపరీతమైన తలనొప్పి వేధిస్తుందని చెబుతున్నారు.
* నైట్ ఫిష్ట్‌లో పనిచేసే వారికి కూడా ఉదయం తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో సిర్కాడియన్ రిథమ్ డిజార్డర్ రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం సహజ గడియారంపై ప్రభావం పడడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
* ఇక నిద్రలేమితో బాధపడే వారికి కూడా తలనొప్పి సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు నాణ్యమైన నిద్రలేకపోతే ఉయదం లేవగానే తలంతా భారంగా, నొప్పిగా ఉంటుంది.
* స్లీప్ అప్నియాతో బాధపడేవారిలో కూడా తలనొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కునే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గురకతో ఇబ్బందిపడే వారిలో కూడా తలనొప్పి వస్తుందని చెబుతున్నారు.
* ఇక ఉదయాన్నే విపరీతమైన తలనొప్పికి సైనస్ కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇన్ఫెక్షన్ కారణంగా కూడా తలనొప్పి రావొచ్చు.. ముక్కు, కళ్లు, నుదిటి భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. కొందరిలో ఇలాంటి నొప్పి సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..