కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారా ? అయితే ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులకు మధ్య తేడా ఎంటో తెలుసుకోండి..

Corona Virus: గతేడాది యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్ లో మారణ హోమాన్ని సృష్టిస్తోంది.

కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారా ? అయితే ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులకు మధ్య తేడా ఎంటో తెలుసుకోండి..
Corona Test
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2021 | 3:40 PM

Corona Virus: గతేడాది యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్ లో మారణ హోమాన్ని సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ దాటికి భారత్ అతాలకుతలం అవుతోంది. ప్రపంచ దేశాలు సైతం ఇండియాను రెడ్ జోన్ గా ప్రకటించి.. భారతీయులకు తమ దేశాలలోకి అనుమతి లేదంటూ కరాఖండిగా చెప్పెసాయి. ఇక రోజూకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా… వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం స్వల్ప లక్షణాలున్నా కానీ కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు ధైర్యంగా ఆసుపత్రిలకు వస్తున్నారు. కానీ కొన్ని చోట్ల జరిపే పరీక్షలతో ప్రజలు ఆందోళన చెందుతున్నరు. ఇందుకు కారణం.. లక్షణాలు ఉన్నకానీ పరీక్షల్లో నెగిటివ్ గా రావడంతో ప్రజలు ఆందోళకు గురవుతున్నారు. ఇక చాలా మంది ర్యాపిడ్ టెస్టుల కంటే.. ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ రెండు టెస్టులకు మధ్య ఉన్న తేడా గురించి చెప్పుకుంది.

ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులను పాయింట్ ఆఫ్ కేర్ అంటారు. అంటే వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి చేసుకోవచ్చు. అదే ఆర్టీపీసీఆర్ కు పెద్ద ల్యాబొరేటరీ ఎక్విప్ మెంట్ ఉండాలి. ట్రూనాట్ అనేది ఒక చిప్ బేస్డ్ టెస్టింగ్. మన శరీరంలో ఎక్కువ జీన్ లు ఉంటాయి. అయితే ఇది కొన్ని జీన్ లను మాత్రమే కనుక్కుంటుంది. వీటిలో వైరస్‌ ఉందో లేదో మాత్రమే గుర్తిస్తుంది. తక్కువ సమయంలో రిజల్ట్‌ వస్తుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఎక్కువ జీన్ లను గుర్తించే అవకాశం ఉంటుంది. కేసులు కేసులు ఎక్కువవుతున్నాయి కాబట్టి, తక్కువ సమయంలో రిజల్ట్‌ వస్తుంది కాబట్టి, అలాగే ఎక్కడైనా టెస్టు చేసేందుకు అవకాశం ఉందన్న ఉద్దేశంతో ట్రూనాట్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులకు అనుమతి ఇచ్చారు. గొంతులో ద్రవం తీసి కిట్‌పై వేస్తే 10 నిమిషాల్లో రిజల్ట్‌ వస్తుంది. ఇందులో పాజిటివ్‌ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్‌కు వెళ్లి నిర్ధారించుకోవచ్చు. ఆర్టీపీసీఆర్‌నే గోల్డెన్‌ స్టాండర్డ్‌ టెస్టుగా చెప్పుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.

Also Read: కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందా.. అయితే ఈ విషయాల్లో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే మోసం మొదటికే..

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.