Lady Doctor performed funeral : ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లికి, చెల్లికి అంత్యక్రియలు చేసిన యువ వైద్యురాలు

ఎప్పుడూ నవ్వుతూ హాయిగా సుఖ శాంతులతో సాఫీగా సాగే ఆ సంసారంలో రోడ్డు ప్రమాదం కటిక చీకటిని మిగిల్చింది. ఇద్దరినీ..

Lady Doctor performed funeral : ఘోర రోడ్డు ప్రమాదం..  తల్లికి, చెల్లికి అంత్యక్రియలు చేసిన యువ వైద్యురాలు
Cremation
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 17, 2021 | 11:48 PM

Lady doctor who performed the funeral for mother and sister : ఎప్పుడూ నవ్వుతూ హాయిగా సుఖ శాంతులతో సాఫీగా సాగే ఆ సంసారంలో రోడ్డు ప్రమాదం కటిక చీకటిని మిగిల్చింది. ఇద్దరినీ మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం మొత్తం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక (గాంధీనగరం) చెందిన జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు చోడిశెట్టి చంద్రశేఖర్ సోదరి సింగలూరి వీర ధనలక్ష్మి, తన భర్త శ్రీనివాస్, కుమార్తె కావ్యతో కలిసి చెముడులంక నుండి విశాఖ జిల్లా కారులో వెళుతున్నారు. అయితే, వాళ్లు ప్రయాణిస్తోన్న కారు విశాఖపట్నం సమీపంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కుమార్తె కావ్య, ధనలక్ష్మి స్పాట్ లోనే మృతి చెందగా భర్త శ్రీనివాస్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శ్రీనివాస్ – ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, ఒక కుమార్తె సుప్రజ బెంగుళూరులో ప్రముఖ వైద్యురాలు. రోడ్డు ప్రమాదంలో తన తల్లి, చెల్లి మరణించడం, తండ్రి ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండటంతో డాక్టర్ సుప్రజ అన్నీ తానై నిలిచింది. తల్లి, చెల్లి మరణించిన వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన చెముడులంక చేరుకుంది.

విశాఖపట్నంలో మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిన అనంతరం చెముడులంకకు తరలించి అక్కడ నుండి బడుగువానిలంక గౌతమి గోదావరి చెంతన గల పుష్కర ఘాట్ వద్ద వారి అంత్యక్రియల్లో పాల్గొని తలకొరివి పెట్టింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. స్థానికంగా మంచి మనుషులుగా పేరున్న ఆ కుటుంబం ఒకే సారి ఇద్దర్నీ కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read also : KTR : తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్ ఇత‌ర రాష్ట్రాల‌కు దిక్సూచిగా నిలుస్తాయి : మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే