Andhra Pradesh: ఒకవైపు తండ్రి మృతి.. మరోవైపు ఇంటర్ పరీక్ష.. ఎగ్జామ్ రాసి అంత్యక్రియలు చేసిన కుమార్తె
అయ్యో.. కాలం ఆ చిట్టి తల్లికి ఎంతటి కఠిన పరీక్ష పెట్టిందో..! ఆ కూతురు కష్టం వింటే గుండె కుంగిపోద్ది. ఒకవైపు ఇంటర్ పరీక్షలు, మరో వైపు కన్న తండ్రి మృతదేహం. నాన్న దూరమయ్యాడనే దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పరీక్ష రాసేందుకు వెళ్ళింది ఆ బంగారు తల్లి. బరువైన గుండెతో ఇంటికి తిరిగొచ్చి, తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కన్న కూతురు కష్టం ప్రతీ ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించింది.

ఈ హృదయవిధారకర ఘటన విశాఖలో జరిగింది. గాజువాక మల్కాపురం హనుమాన్‌నగర్‌కు చెందిన ఎల్.సోమేష్ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మానసిక స్థితి సరిగా ఉండదు. చిన్నకుమార్తె డిల్లీశ్వరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తోంది. సోమేష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గుల్లలపాలెం శ్మశానవాటికకు తరలించారు. అయితే తండ్రి మృతి చెందాడన్న విషయం తెలుసుకోలేని మానసిక పరిస్థితి పెద్దకుమార్తెది. అమ్మా ఇంటికి వెళ్లిపోదాం పద నాన్న తర్వాత ఇంటికి వస్తాడులే.. అంటూ మృతదేహం వద్ద విలపిస్తూ.. తల్లితో అన్న మాటలు అక్కడున్న వారి గుండెలను పిండేశాయి.
ఇద్దరూ కూతుళ్లు కావడం, పెద్ద కూతురుకు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తండ్రికి అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత చిన్న కూతురు తీసుకుంది. అయితే పరీక్షకు వెళ్లనని, అంత్యక్రియలు చేస్తానని, చిన్నకుమార్తె పట్టుబట్టింది. పరీక్ష రాసి వచ్చే వరకు మృతదేహాన్ని అలాగే ఉంచుతామని నచ్చ చెప్పడంతో, దిల్లీశ్వరి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. తండ్రి మృతి చెందిన బాధతోనే పరీక్ష రాసింది. అనంతరం గుండెలు బాదుకుంటూ శ్మశానానికి వచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. ఆ దృశ్యాలు అక్కడ హాజరైన అందరినీ కంట తడి పెట్టించాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…