AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో 1150 పోస్టాఫీస్ జాబ్స్.. దరఖాస్తులకు రేపే చివరితేదీ.. టెన్త్ పాసైనవారు అర్హులు..

తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం.. 1150 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

తెలంగాణలో 1150 పోస్టాఫీస్ జాబ్స్.. దరఖాస్తులకు రేపే చివరితేదీ.. టెన్త్ పాసైనవారు అర్హులు..
Rajitha Chanti
|

Updated on: Feb 25, 2021 | 11:08 AM

Share

Telangana Post Office Recruitment 2021: తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం.. 1150 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 చివరితేదీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://appost.in/ వెబ్‌సైట్‏లో చూడొచ్చు.

ఇందులో మొత్తం 1150 ఖాళీలుండగా.. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు మ్యాథమేటిక్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో టెన్త్ పూర్తిచేసి ఉండాలి. ఒక్కో అభ్యర్థి కనీసం పదో తరగతి వరకు స్థానిక భాషలో చదివి ఉండాలి. కనీసం 60 రోజుల శిక్షణా వ్యవధితో ఏదైనా కంప్యూటర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బేసిక్ కంప్యూటర్ ట్రెయినింగ్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. కంప్యూటర్‌ను ఒక సబ్జెక్టుగా పదో తరగతిలో చదివితే సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. అభ్యర్థులకు జనవరి 27 నాటికి 18-40 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ళు, ఓబీసీలకు మూడేళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ళు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఇదిలా ఉండగా.. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఉన్నత విద్యార్హతలకు అదనపు వెయిటేజ్ ఏమీ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. కేవలం ఆన్ లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్, ట్రాన్స్ మెన్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఉమెన్స్, ట్రాన్స్ విమెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 చివరితేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి https://appost.in/ వెబ్‏సైట్ సందర్శించండి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగా https://appost.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత దరఖాస్తు ఫీజు పే చేయాలి. ఆన్ లైన్ లో పేమెంట్ చేస్తే సెటిల్మెంట్ కోసం 72 గంటల సమయం పట్టె అవకాశం ఉంది. అనంతరం ఆఫ్ లైన్ లో పోస్టాఫీసులో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ స్వీకరించే పోస్ట్ ఆఫీస్ జాబితా కనిపిస్తుంది. పేమెంట్ తర్వాత మూడో స్టేజ్ దరఖాస్తు ఉంటుంది. అందులో ముందుగా దరఖాస్తు ఫాం పూర్తిచేసి.. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత పోస్ట్ సెలక్ట్ చేసి.. దరఖాస్తు ఫాంను సబ్మిట్ చేయాలి.

Also Read:

టెన్త్ పాసైనవారికి RBIలో ఉద్యోగాలు.. మొత్తం 841 ఖాళీలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..