టెన్త్ పాసైనవారికి RBIలో ఉద్యోగాలు.. మొత్తం 841 ఖాళీలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచులలోని ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

టెన్త్ పాసైనవారికి RBIలో ఉద్యోగాలు.. మొత్తం 841 ఖాళీలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..
RTGS Services
Follow us

|

Updated on: Feb 25, 2021 | 10:11 AM

RBI office attendant recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచులలోని ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‏లో 57 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 15 చివరితేదీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.rbi.org.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఇందులో మొత్తం ఖాళీలు ఉండగా.. పదవ తరగతి పూర్తైనవారు అర్హులు. ఫిబ్రవరి 2, 2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ఫిబ్రవరి 1, 2021 నాటికి అభ్యర్థుల వయసు 18-24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఆన్ లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆన్ లైన్ లోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్ లైన్ లేదా మరే ఇతర పద్ధతుల్లో అప్లికేషన్స్ సమర్పించకూడదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, జనరల్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9, 10 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://www.rbi.org.in/ సందర్శించండి.

Also Read:

yellow watermelons: పసుపు పుచ్చకాయలను పండిస్తున్న కర్ణాటక రైతు.. లక్షలు సంపాదన..