yellow watermelons: పసుపు పుచ్చకాయలను పండిస్తున్న కర్ణాటక రైతు.. లక్షలు సంపాదన..

కర్ణాటకలోని ఒక రైతు పసుపు పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతున్నాడు. కలబుర్గిలోని కొరల్లి గ్రామానికి

yellow watermelons: పసుపు పుచ్చకాయలను పండిస్తున్న కర్ణాటక రైతు.. లక్షలు సంపాదన..
Follow us

|

Updated on: Feb 25, 2021 | 8:09 AM

Karnataka farmer is growing yellow watermelons : కర్ణాటకలోని ఒక రైతు పసుపు పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతున్నాడు. కలబుర్గిలోని కొరల్లి గ్రామానికి చెందిన బసవరాజ్ పాటిల్ అనే వ్యక్తి గ్రాడ్యూయేట్ పూర్తిచేశాడు. అతను తాను పండించిన పంటను నగరంలోని స్థానిక మార్ట్.. బిగ్ బజార్‏లలో అమ్మెవాడు. పాటిల్ శాస్త్రీయంగా పండించిన పసుపు పుచ్చకాయల నుంచి మంచి లాభాలను ఆర్జిస్తున్నట్లు చెప్పుకోచ్చాడు. పుచ్చకాయల ఉత్పత్తికి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటివరకు వాటిని అమ్మడం ద్వారా దాదాపు లక్ష రూపాయలను అందుకుంటున్నాడు. ఎర్ర పుచ్చకాయల కన్నా పసుపు పుచ్చకాయలు తీపి ఎక్కువగా ఉంటుందని పాటిల్ చెప్పుకోచ్చారు.

భారతదేశంలో పంట ఉత్పత్తిని రైతులు వైవిధ్యపరచాలని పాటిల్ అభిప్రాయం వ్యక్తపరిచాడు. పసుపు పుచ్చకాయలు ఎరుపు రంగులో ఉండేలా కలిసి ఉంటుంది. గతంలో గోవాకు చెందిన ఇంజినీర్ నుంచి రైతుగా మారిన ఓ వ్యక్తి కూడా ఇలాగే పసుపు పుచ్చకాయలను సేంద్రీయంగా పండించాడు. బోర్కర్ రసాయన ఎరువులు.. పురుగుల మందులను ఉపయోగించకుండా.. 250 పసుపు పుచ్చకాయలను సాగు చేశాడు. అతను తన వ్యవసాయ భూమిలో రూ.4000 పెట్టుబడి పెట్టి.. పుచ్చకాయల అమ్మకం ద్వారా దాదాపు రూ.30,000 కంటే ఎక్కువగా సంపాదించాడు. సిట్రల్లస్ లానాటస్ అనే శాస్త్రీయంగా పిలువబడే ఈ పుచ్చకాయలను ముందుగా ఆఫ్రికాలో పండించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1000 రకాలకు పైగా ఈ పంటను పండిస్తున్నారు. పసుపు పుచ్చకాయలు..

సాధరణంగా లేత పసుపుతోపాటు కొద్దిగా బంగారు రంగులో ఉంటాయి. ఇందులో కూడా మాములు పుచ్చకాయల్లో ఉండే గోధుమ నలుపు రంగు విత్తనాలు ఉంటాయి. ఎర్ర పుచ్చకాయలతో పోలిస్తే వీటికి థింకర్ రింగ్ కూడా ఉంటుంది. పసుపు పుచ్చకాయలలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపోందించడమే కాకుండా.. చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఎర్ర పుచ్చకాయ మాదిరిగా కాకుండా.. పసుపు పుచ్చకాయలో ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఇది క్యాన్సర్, కంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

Also Read:

మీరు ఎక్కువగా జంక్ పుడ్ తింటున్నారా.. అయితే మీకు సంతాన భాగ్యం అంతంత మాత్రమే.. ఎందుకో తెలుసా..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!