AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పటి కరువు ప్రాంతాలు, ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మారుమ్రోగుతున్నాయి,. ఏవి.. ఆ రెండు తెలుగు ప్రాంతాలు, ఏమా కథ.?

ఒకప్పుడు కరువుసీమ. ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు అందుకునే స్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు నేషనల్‌ అవార్డ్‌ వరించింది. మరోవైపు కేవలం రెండేళ్లలోనే..

ఒకప్పటి కరువు ప్రాంతాలు, ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మారుమ్రోగుతున్నాయి,. ఏవి.. ఆ రెండు తెలుగు ప్రాంతాలు, ఏమా కథ.?
Venkata Narayana
|

Updated on: Feb 25, 2021 | 7:28 AM

Share

ఒకప్పుడు కరువుసీమ. ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు అందుకునే స్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు నేషనల్‌ అవార్డ్‌ వరించింది. మరోవైపు కేవలం రెండేళ్లలోనే ఓ తెలంగాణ గ్రామం.. ఆదర్శగ్రామంగా రూపుదిద్దుకుని జాతీయ అవార్డ్‌ సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని వ్యవసాయ రంగంలో సత్తా చాటాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పీఎం కిసాన్ జాతీయ అవార్డును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నుంచి అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అవార్డు అందుకున్నారు. పీఎం కిసాన్ కింద లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ విభాగంలో జిల్లాకు జాతీయ అవార్డు వరించింది. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల వెరి ఫికేషన్ ను జిల్లా యంత్రాంగం పూర్తి చేయగా.. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో జిల్లాకు జాతీయ అవార్డు వరించింది. రైతుల కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కినట్టయిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు తెలంగాణలో కూడా ఓ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌.. ఒకప్పడు ఈ గ్రామం పేరు ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడీ ఊరి పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది మెట్లచిట్టాపూర్‌. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిని ఆసరాగా చేసుకొని తన రూపురేఖలను పూర్తిగా మార్చుకొంది. ఈ మార్పులన్నింటినీ స్వచ్ఛభారత్‌ కార్యకర్తలు స్వచ్ఛభారత్‌ గ్రామీణ యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. గ్రామంలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. దీంతో బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ప్రకటించబడింది. పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్‌యార్డు, ఇంటింటికీ ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడుగుంతలు, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, ఇలా అన్నీ సమకూర్చుకున్నారు. కంపోస్టు షెడ్డు నిర్మించి సేంద్రియ ఎరువు సైతం తయారు చేస్తూ ఇప్పుడు జాతీయ స్థాయిలో గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచింది మెట్లచిట్టాపూర్‌. దీంతో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కార్యాలయం ట్విట్టర్‌లో ఆదర్శగ్రామంగా ప్రకటించింది.

Read also :

Bollineni, Sudharani : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎస్టీ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం

బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!