Monkey Last Rites: మానవత్వం చాటుకున్న గ్రామస్థులు.. హిందూ సాంప్రదాయల ప్రకారం కొండంగులకు అంత్యక్రియలు
మనుషులకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగానే జంతువులకు కూడా అంత్యక్రియలు నిర్వహిస్తారా.. అవును ఇక్కడ గ్రామస్తులు తమతోపాటు కలిసి జీవించిన కొండంగులకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.
Last Rites for Monkey: మనుషులకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగానే జంతువులకు కూడా అంత్యక్రియలు నిర్వహిస్తారా.. అవును ఇక్కడ గ్రామస్తులు తమతోపాటు కలిసి జీవించిన కొండంగులకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. కొంతమందికి పెంపుడు జంతువులంటే ప్రాణం. తమతో పాటు వాటికీ సమానంగా ఆహారపానీయాలు, పడక సదుపాయాలు కల్పిస్తుంటారు కొందరు. వాటికి ఏదైనా అయితే విలవిల్లాడిపోతుంటారు కూడా. మరి, అంత ప్రాణప్రదంగా చూసుకొనే పెంపుడు జంతువులు చనిపోతే ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. తమ మనుషుల్లాగే వాటికీ అంత్యక్రియలు నిర్వహించాలని చాలామంది భావిస్తుంటారు.
పల్లె వాసులు ప్రకృతితో మమేకం అవుతారు. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువు, జీవిని భగవంతుడితో సమానంగా భావిస్తుంటారు. తమతో సహజీవనం చేసిన కొండంగులకు మనుషులకు మాదిరిగానే హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు ఇక్కడ గ్రామస్తులు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతలగూడెంలో చనిపోయిన కొండంగికి గ్రామస్తులు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మూడు కొండంగులు చనిపోగా, వాటిని కూడా ట్రాక్టర్‌లో ఊరేగింపుగా తీసుకెళ్లి మనుషులకు చేసినట్టుగానే అంతిమ సంస్కారాలు చేసారు. తాజాగా చనిపోయిన మరో కొండంగికి గ్రామస్తులు ట్రాక్టర్ పై ఉరేగిస్తూ.. అంతిమయాత్ర నిర్వహించి పూడ్చి వేశారు.
ఇదిలావుంటే, తమ పంట పొలాలకు కోతుల నుంచి రక్షణగా నిలిచిన కొండంగులు మృతి చెందడంతో… గ్రామ పెద్ద కోల్పోయినట్లుగా భావించిన గ్రామస్తులు కొండంగి హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. హనుమంతుడి అవతారమైన కోతులు ప్రాణాలు కోల్పేతే పూడ్చి పెట్టాలని, అలా వదిలేస్తే గ్రామానికి అరిష్టం ఏర్పడుతుందని గ్రామస్తులు భావించారు. దీంతో గ్రామస్తులంతా కలిసి మృతిచెందిన కొండంగికి హిందూ సాంప్రదాయ పద్ధతులు అంత్యక్రియలు నిర్వహించామని గ్రామస్థులు తెలిపారు.