IIT Kharagpur: ప్లేస్‌మెంట్ 2021 డ్రైవ్‌లో IIT కాన్పూర్ విద్యార్థుల రికార్డు.. 49మందికి ఏడాదికి కోటి రూపాయల జీతం!
IIT కాన్పూర్ మరోసారి రికార్డును బద్దలు కొట్టింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT కాన్పూర్)లో 49 మంది విద్యార్థులు కోటి రూపాయల కంటే ఎక్కువ ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌లను పొందారు.
IIT Kharagpur placement drive 2021: IIT కాన్పూర్ మరోసారి రికార్డును బద్దలు కొట్టింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT కాన్పూర్)లో 49 మంది విద్యార్థులు కోటి రూపాయల కంటే ఎక్కువ ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌లను పొందారు. IIT కాన్పూర్ విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన, “మొదటి ఎనిమిది రోజుల్లో, ఇన్స్టిట్యూట్ 47 అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలకు చెందిన ఆఫర్లను అందుకున్నారు.19 అంతర్జాతీయ ప్రతిపాదనలు అందిన అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 150 శాతం భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు అత్యధిక ప్యాకేజీ అంతర్జాతీయంగా 274,250 అమెరికా డాటర్లు కాగా, ఇది దేశీయంగా రూ. 1.2 కోట్లు. IIT కాన్పూర్‌లో జరుగుతున్న క్యాంపస్ ప్లేస్‌మెంట్ సీజన్‌లో మొదటి ఎనిమిది రోజుల్లో రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన మొత్తం 49 ఉద్యోగ ఆఫర్‌లు అందాయి.
IITలలో ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో టాప్ రిక్రూటర్‌లు Xtria, EXL, Graviton, Goldman Sachs, ICICI బ్యాంక్, ఇంటెల్, Microsoft, Ola, Rubric, Samsung, Quaday, Uber, Tiger Analytics వంటి సంస్థలు పాల్గొన్నాయి.156 PPOలు, అలాగే 885 ప్లేస్‌మెంట్ ఫేజ్ 1 ఆఫర్‌లను అంగీకరించడం ద్వారా మొత్తం 1,041 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. 287 కంపెనీలు తమ నియామక ప్రక్రియను పూర్తి చేశాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్ NIRF ర్యాంకింగ్స్ 2020 ఇంజినీరింగ్ విభాగంలో 5వ స్థానంలో ఉంది. QS 2021 ఆసియా ర్యాంకింగ్స్‌లో 58వ స్థానంలో కొనసాగుతోంది. ఈ IIT దాని చరిత్రలో 1,600 ఉద్యోగ ఆఫర్‌లతో అత్యధిక సంఖ్యలో ప్లేస్‌మెంట్ ఆఫర్లను నమోదు చేసింది. ఇది సంవత్సరానికి అత్యధికంగా రూ. 2.4 కోట్ల CTCని కలిగి ఉంది. వీరిలో దాదాపు 35 మంది విద్యార్థులు అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్‌లను కూడా అందుకున్నారు.
ఇటీవల, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT BHU, బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో ఓ విద్యార్థికి తొలిరోజే రూ.2 కోట్ల ప్యాకేజీని అందించారు. ఈ ఆఫర్‌తో క్యాంపస్‌లో ఆనంద వాతావరణం నెలకొంది. ప్లేస్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, విద్యార్థులు స్వయంగా IIT BHU ప్లేస్‌మెంట్ పోర్టల్‌ను సిద్ధం చేశారు. ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ placement.iitbhu.ac.inని సందర్శించవచ్చని సూచించారు.