APSFC Recruitment: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
APSFC Recruitment: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న హెడ్ ఆఫీస్ ఉన్న ఖాళీలను భర్తీ చేయనునున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..
APSFC Recruitment: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న హెడ్ ఆఫీస్ ఉన్న ఖాళీలను భర్తీ చేయనునున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, ఎవరు అర్హులులాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లోభాగంగా మొత్తం 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా ఫైనాన్స్, టెక్నికల్,లా విభాగాల్లో ఉన్న ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సబ్జెక్టుల్లో లా పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నాల్జెడ్ తప్పనిసరి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఇందులో మెరిట్ సాధించిన వారిని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 24-12-2021న ప్రారంభమవుతుండగా, 19-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
30 ఏళ్ల తర్వాత వీటిని తినడం తప్పనిసరి.. అస్సలు మరిచిపోవద్దు..
Benefits of Black Carrot: చలికాలంలో బ్లాక్ క్యారెట్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు..అవేంటో తెలుసా..