‘స్ట్రాబెర్రీ బిర్యానీ’ గురించి మీకు తెలుసా ? నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు.. ఎవరు చేశారంటే..
'ఇంటర్నెట్' మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. తెలియని విషయాలు తెలుసుకోవడమే కాకుండా.. కొంత మంది సోషల్ మీడియాలో విచిత్రమైన ఫోటోలు..
‘ఇంటర్నెట్’ మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. తెలియని విషయాలు తెలుసుకోవడమే కాకుండా.. కొంత మంది సోషల్ మీడియాలో విచిత్రమైన ఫోటోలు.. అలాగే వీడియో షేర్ చేస్తుంటారు. ఇక గతేడాది నెట్టింట్లో అనేక రకాల వంటకాలు ట్రెండ్ అయ్యాయి. తాజాగా మరో వంటకం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ‘స్ట్రాబెరీ బిర్యానీ’. అవును మీరు విన్నది నిజమే. స్ట్రాబెరీలతో చేసిన బిర్యానీ. ప్రస్తుతం ఈ వంటకం ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుంది. అసలు ఎవరైన బిర్యానితో స్ట్రాబెరీలను ఊహించుకుంటారా ? అయితే ఈ స్ట్రాబెరీ బిర్యాని ఫోటోలను పాకిస్తాన్‌కు చెందిన ఓ ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేస్తూ.. దాని గురించి చెప్పాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేశాడు. ఇక అతడు షేర్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇస్లామాబాదుకు చెందిన సాద్ అనే వ్యక్తి ఒక పెద్ద అండలో బిర్యానీ చేసి.. దానిపై స్ట్రాబెరీలతో అలంకరించాడు. ఇక ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో.. “మేము ఈ రోజు ఇంట్లో స్ట్రాబెరీ బిర్యాని తయారు చేసాము. దీని గురించి ట్విట్టర్లో ఏం చెప్తారో తెలుసుకోవాలనుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఫోటోను షేర్ చేసిన 24 గంటల్లో 2.3కే లైక్స్, 1.6కే రీట్వీట్స్ మరియు 1కే కామెంట్స్ వచ్చాయి. ఇది చూసిని కొంత మంది నెటిజన్లు బర్గర్ ఐస్ క్రీం, పైనాపిల్ పిజ్జా వంటి ఇతర వైరల్ ఫుడ్స్‌తో దీనిని పోలుస్తున్నారు. మరో నెటిజన్ బిర్యానీ విత్ ఇలాచీ లేదా న్యూటెల్లా బిర్యానీ అనేవి చెత్త కాంబినేషన్స్ అని.. ప్రస్తుతం ఈ కాంబో వాటిని మించిందని కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఆ వైరల్ స్ట్రాబెరీ బిర్యానీని మీరు ఒకసారి చూసేయ్యండి.
We made “Strawbiryani” at home today and I am curious to know what desi Twitter has to say about it. pic.twitter.com/PCZ0Ug38gc
— Saad ? (@SaadGH) February 19, 2021
Also Read: