Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ ల కథేమిటి? క్రియాశీలంగా లేని అన్ని ఖాతాలకూ నీలం గుర్తు తీసేసిందా?
Twitter Blue Tick: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నిబంధనల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న ట్విట్టర్ కు, ప్రభుత్వానికి మధ్య యుద్ధం ముదిరినట్టు కనిపిస్తోంది.
Twitter Blue Tick: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నిబంధనల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న ట్విట్టర్ కు, ప్రభుత్వానికి మధ్య యుద్ధం ముదిరినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించని ట్విట్టర్ ఈరోజు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరి కొంతమంది నేతల ట్విట్టర్ ఎకౌంట్లకు బ్లూ టిక్ తీసేసింది. తరువాత వచ్చిన నిరసనల నేపధ్యంలో మళ్ళీ ఆ టిక్ లు ఇచ్చేసింది. ఇది జరిగిన కొంతసేపటికి భారత ప్రభుత్వం ట్విట్టర్ కు చివరి అల్టిమేటం జారీచేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల విషయంలో కచ్చితంగా ట్విట్టర్ ప్రతి స్పందించాల్సిందే అని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించి తీరాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం వివాదం మరింత్ వేడిగా మారింది. ఈ నేపధ్యంలో అసలు ట్విట్టర్ బ్లూ టిక్ కథ ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ టిక్ ల తొలగింపులో ట్విట్టర్ బెదిరింపులకు పాల్పడుతోంది అనే విమర్శలు నిజమేనా అనేది పరిశీలిస్తే..
బ్లూ టిక్ అంటే ఏమిటి?
ట్విట్టర్ ప్రకారం, బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) అంటే ఖాతా నిజమైనది, అలాగే ప్రజా ప్రయోజనం కోసం నిర్వహిస్తున్నది అని ఇచ్చే గుర్తింపు. ఈ టిక్ పొందడానికి, క్రియాశీల ట్విట్టర్ ఖాతా కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం, ట్విట్టర్ ప్రభుత్వ సంస్థలు, బ్రాండ్లు, లాభాపేక్షలేని సంస్థలు, వార్తా సంస్థలు, జర్నలిస్టులు, వినోదం, క్రీడలు, ఇ-స్పోర్ట్స్, కార్యకర్తలు, నిర్వాహకులు మరియు ఇతర ప్రభావకారుల యొక్క నిర్దిష్ట ఖాతాలను ధ్రువీకరించి ఈ బ్లూ టిక్ ఇస్తూ వస్తోంది.
ఎందుకు తొలగిస్తుంది..
నిబంధనల ప్రకారం ట్విట్టర్ నీలిరంగు టిక్ లను తొలగించే అధికారం కలిగి ఉంటుంది. ఎవరైనా వారి హ్యాండిల్ పేరును మార్చుకుంటే లేదా వినియోగదారు తన ఖాతాను ధృవీకరించిన విధంగా ఉపయోగించకపోతే. ఈ సందర్భంలో బ్లూ టిక్ అనగా బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఎటువంటి నోటీసు లేకుండా తొలగించవచ్చు. అదేవిధంగా ఎక్కువ కాలం క్రియాశీలంగా లేకపోయినా ఆ ఖాతాలకు బ్లూ టిక్ తొలిగించే అవకాశం ట్విట్టర్ కు ఉంది. ఇప్పడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు బ్లూ టిక్ తొలిగించడానికి కారణం క్రియాశీలంగా లేకపోవడమే అని ట్విట్టర్ చెబుతోంది.
మరి ఇదేమిటి?
ట్విట్టర్ ఇలా క్రియాశీలంగా లేని ఖాతాలకు బ్లూ టిక్ తొలగిస్తామని చెప్పడం నిజమైనా.. ఈ వ్యవహారంలో మాత్రం దూకుడుగా వ్యవహరించింది అనేది స్పష్టం అవుతోంది. ఎందుకంటే, క్రియాశీలంగా లేని అన్ని ఖాతాలనూ ట్విట్టర్ తోలిగించలేదు. కేవలం దేశంలో ముఖ్యమైన వారికి చెందిన ముగ్గురు నలుగురివి మాత్రమే ఇలా చేసింది. చనిపోయిన వారి ఖాతాలకు బ్లూ టిక్ కొనసాగుతోంది..
దివంగత మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, నటుడు ఇర్ఫాన్ ఖాన్ సహా చాలా మంది ట్విట్టర్ ఖాతాలు ధ్రువీకరించినవె. వీటికి బ్లూ టిక్ ఉంది. ఇవి ఇంకా బ్లూ టిక్ తొ కొనసాగుతున్నాయి. ప్రణబ్ ముఖర్జీ ట్విట్టర్ ఖాతా నుండి చివరి ట్వీట్ 2020 ఆగస్టులో ఆయన మరణానికి ముందు జరిగింది. అదే సమయంలో, అక్టోబర్ 2020 నుండి అహ్మద్ పటేల్ ఖాతా సక్రియంగా లేదు. మే 2020 నుండి ఇర్ఫాన్ ఖాతా సక్రియంగా లేదు. ఈ ఖాతాలను స్మారక ఖాతాలుగా కూడా ఉపయోగించడం లేదు. అంటే, అతని మరణం తరువాత, అతని కుటుంబ సభ్యులు ఈ ఖాతాలను వారసత్వంగా ఉపయోగించడం లేదు. కానీ ఈ ఖాతాలకు బ్లూ టిక్ ఉండడం గమనార్హం.
ఏది ఏమైనా ట్విట్టర్ ధోరణి ప్రభుత్వాన్ని లెక్కచేయకుండా.. రెచ్చకొట్టే విధంగానే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటువంటి పధ్ధతి సరైనది కాదని వారు ట్విట్టర్ ను ఉద్దేశించి చెబుతున్నారు.
Central Twitter: ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం చివరి వార్నింగ్.. నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు