Silk Sarees Prices: వామ్మో.. ఏకంగా 50 శాతం పెరిగిన పట్టు చీరలు.. రీజన్ ఏమంటే..?

ఒక వైపు పసిడి ధరలు రోజు రోజుకు పెరుగుతుంటే, పట్టు చీరలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల రోజుల క్రితం రూ.5 వేలు ధర పలికి కంచి పట్టు చీర, నేడు రూ 8 వేల నుంచి పది వేల రూపాయలకు చేరింది. తమిళనాడులోని కంచిలో ఏడాదికి 300 కోట్ల రూపాయల మేర జరిగే కంచి పట్టు చీరల వ్యాపారం నేడు రోజు రోజు కు బంగారం ధర పెరుగుతుండంతో ప్రశ్నార్థకరంగా మారింది.

Silk Sarees Prices: వామ్మో.. ఏకంగా 50 శాతం పెరిగిన పట్టు చీరలు.. రీజన్ ఏమంటే..?
Silk Sarees
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 24, 2024 | 7:30 AM

ఒక వైపు పసిడి ధరలు రోజు రోజుకు పెరుగుతుంటే, పట్టు చీరలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల రోజుల క్రితం రూ.5 వేలు ధర పలికి కంచి పట్టు చీర, నేడు రూ 8 వేల నుంచి పది వేల రూపాయలకు చేరింది. తమిళనాడులోని కంచిలో ఏడాదికి 300 కోట్ల రూపాయల మేర జరిగే కంచి పట్టు చీరల వ్యాపారం నేడు రోజు రోజు కు బంగారం ధర పెరుగుతుండంతో ప్రశ్నార్థకరంగా మారింది. ఇలా అయితే చీరలు తయారీ కష్టమని తయారీ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే కంచి పట్టు చీరలు ధరలు ఎందుకు పెరుగుతాయని అనుకుంటున్నారా..? అయితే బంగారం కి పట్టు చీరకు ఉన్న సంబంధం తెలుసుకోవాల్సిందే..!

తమిళనాడులోని కాంచీపురం అందరూ కంచి అని పిలిచే ఊరు.. కంచిలో ఎటు చూసినా పట్టు చీరలే కనిపిస్తాయి. కాంచీపురం పట్టు చీరకు ఉన్న డిమాండ్ దేశంలో ఏ చీరకు లేదంటే నమ్మక తప్పదు. ఒకప్పుడు ఎటు చూసినా మహిళలతో కలకలలాడిన పట్టు చీరల షాపులు ప్రస్తుతం ఖాళీగా బోసిపోతున్నాయి. అయితే షాపులు ఖాళీగా కనిపించేందుకు కారణం పెళ్లి ముహుర్తాలు లేక పోవడం ఒకటైతే, దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండడం ఒక కారణమట.

సాదారణంగా ఒక మోస్తారు రేటు పలికే పట్టు చీరలు తయారు చేసేందుకు బంగారం 0.5 శాతం గోల్డ్ 40శాతం, 35.5 శాతం కాపర్ తో పాటు 24 శాతం పట్టు కలిపి జరి తయారు చేయడం జరుగుతుంది. ఇలా తయారు చేసిన చీరను మార్కెట్ లో రూ.5 వేల కు విక్రయించేవారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధర పెరగడంతో గతంలో ఐదు వేలు పలికిన పట్టు చీర నేడు 8 వేల నుంచి 10 వేల రూపాయలు పలుకుతుంది. మార్కెట్‌లో కంచి పట్టు చీరలు ఒక్కసారిగా ముప్పై శాతం నుంచి యాభై శాతానికి పెరగడంతో చీరల కొనుగోళ్లు తగ్గు ముఖం పట్టాయంటున్నారు వ్యాపారులు. గత 25 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా బంగారు ధర పెరిగిన ప్రభావం కంచి పట్టు చీరలపై పడిందట. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మరింత దయనీయంగా మారుతుందని తయారీ దారులు, వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…