Snake in GHMC Office: జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట నాగుపాము.. పడగ విప్పుతూ పరేషాన్.. వాహనాల రాకపోకలకు అంతరాయం..
Snake Bite in GHMC Office:అడవిలో ఉండే జంతువులు, పాములు జన జీవనంలోకి రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. అందునా హైదరాబాద్‌లాంటి మహానగరంలో అప్పుడప్పుడు మేము కూడా మీతో ఉంటున్నామని
Snake in GHMC Office:అడవిలో ఉండే జంతువులు, పాములు జన జీవనంలోకి రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. అందునా హైదరాబాద్‌లాంటి మహానగరంలో అప్పుడప్పుడు మేము కూడా మీతో ఉంటున్నామని గుర్తు చేస్తుంటాయి. ఆ మధ్యలో రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుతపులి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నగర నడి బొడ్డున ఏకంగా హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఓ నాగుపాము కలకలం సృష్టించింది. పడగ విప్పుతూ అందరిని ఆగం చేసింది. ఆ సంగతేంటో ఇప్పుడు తెలుసుకందాం.
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట నాగుపాము కలకలం రేపింది. పడగ విప్పుతూ అందరిని పరేషాన్ చేసింది. అందరూ గుమిగూడి కోబ్రా ఆటను వింతగా చూడసాగారు. దీంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జాం అయింది. నడి రోడ్డు పై పడగ విప్పి ఆడుతుండటంతో దాని దరిదాపులలోకి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేదు. చాలా ఆవేశంగా కనిపిస్తూ అక్కడే అటు ఇటు తిరగడంతో పలువురు తీవ్ర భయందోళనకు గురయ్యారు. దీంతో అటుగా వెళ్లే వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
భారీ ఎత్తున ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ పోలీసులకు సమాచారం తెలియడంతో వెంటనే వారు అప్రమత్తం అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వాహనదారులతో పాటు పాదాచారులు అందరూ కోబ్రాను చూడటానికి ఎగబడ్డారు. మరికొందరు దాన్ని వీడియోలు, ఫోటోలు తీస్తూ తమ కెమెరాల్లో బంధిస్తూ పలువురికి షేర్ చేస్తూ మురిసిపోయారు. అనంతరం స్నేక్ సొసైటీ మెంబర్స్ వచ్చి పామును తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. దీంతో కథ సుఖాంతమైంది. మొత్తానికి జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట కోబ్రా హల్‌చల్ చేస్తూ అందరిని పరేషాన్ చేసింది.