రిటైర్డ్‌ సోల్జర్‌ రైతుగా మారారు..! పెన్షన్ డబ్బులు ఖర్చు చేస్తూ ఏం చేస్తున్నాడంటే..?

khirod jena: ఒక రిటైర్డ్‌ సోల్జర్ రైతుగా మారారు. మొక్కలు నాటుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లక్ష పండ్ల చెట్లను

రిటైర్డ్‌ సోల్జర్‌ రైతుగా మారారు..! పెన్షన్ డబ్బులు ఖర్చు చేస్తూ ఏం చేస్తున్నాడంటే..?
Mango
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2021 | 6:28 AM

khirod jena: ఒక రిటైర్డ్‌ సోల్జర్ రైతుగా మారారు. మొక్కలు నాటుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లక్ష పండ్ల చెట్లను నాటాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. అతను 15 సంవత్సరాల క్రితం నాటిన మామిడి చెట్లు ఇప్పుడు ఫలాలను అందిస్తున్నాయి. అతడు చేసిన పనిని ప్రజలందరు మెచ్చుకుంటున్నారు. అతడు ఎవరో కాదు జాజ్‌పూర్ రిటైర్డ్ సైనికుడు ఖిరోద్ జెనా. సాధారణంగా ప్రజలు తమ బ్యాగ్‌లలో లంచ్ బాక్స్‌లు పెట్టుకొని ప్రతిరోజు కార్యాలయాలకు వెళుతారు. కానీ ఖిరోద్ జెనా రోజు మొక్కలతో నిండిన బ్యాగ్‌తో మొదలవుతుంది.

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు తన ద్విచక్రవాహనంపై మొక్కల బ్యాగ్‌ పెట్టుకొని ఖాళీ స్థలం కోసం వెతుకుతుంటారు. తగిన స్థలం దొరికిన తర్వాత మొక్కను నాటుతారు. దాని చుట్టూ వెదురు కంచెని నిర్మించి పశువుల నుంచి కాపాడుతారు. గత 16 సంవత్సరాలుగా అతడి దినచర్య ఇదే. ఇప్పటికీ అలసిపోలేదు. బరచనా బ్లాక్‌లోని కళాశ్రీ గ్రామానికి చెందిన 54 ఏళ్ల జెనా మాజీ సైనికుడు. జాజ్‌పూర్‌ను పచ్చగా మార్చాలనే లక్ష్యంతో ఉన్నారు. 2005 లో ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి జెరా బారచన బ్లాక్‌లోని 11 గ్రామాల్లో మామిడి, జామ, జామున్, జాక్‌ఫ్రూట్‌తో సహా 20,000 పండ్ల చెట్లను నాటారు. ఈ సంవత్సరం వర్షాకాలంలో అతను 600 పండ్ల మొక్కలను నాటాడు.

సైన్యాధ్యక్షుడు కిషోర్ చంద్ర దాస్ స్ఫూర్తితో జెనా రిటైర్మెంట్‌ తర్వాత మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు. కిషోర్ చంద్ర దాస్ ఈ ప్రాంతంలో ఇదే విధంగా మొక్కలు నాటేవారు. జెనా తన పెన్షన్ డబ్బులతో ఈ మొక్కలను సంరక్షిస్తారు. ప్రతి నెలా సుమారు రూ.10,000 ఖర్చు చేస్తూ మొక్కలు, నాటడం, ఫెన్సింగ్ మెటీరియల్, ఎరువులు, కొనుగోలు చేయడం చేస్తారు. జెనా మాట్లాడుతూ.. “నేను 15 సంవత్సరాల క్రితం నాటిన మామిడి చెట్లు ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. మామిడి పండ్లను సేకరించి మార్కెట్‌లో విక్రయించడం ద్వారా స్థానిక ప్రజలు జీవనం సాగిస్తున్నారు. లక్షకు పైగా పండ్ల చెట్లను నాటడమే నా లక్ష్యం ” అని అన్నారు.

Malaria Vaccine: ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్.. పిల్లల కోసం ఆమోదించిన WHO