కాయిన్స్‏కు బదులుగా రూపాయి నోటు.. కారణం అదే.. వంద సంవత్సరాలుగా చెలామణి..

ప్రస్తుతం కాలంలో రూపాయికి చాలా తక్కువ విలువ ఉంది. రూపాయి మార్కెట్లో చెలామణి అవుతున్న దీనికి విలువ మాత్రం తక్కువే ఉంది.

కాయిన్స్‏కు  బదులుగా రూపాయి నోటు.. కారణం అదే.. వంద సంవత్సరాలుగా చెలామణి..
One Rupee Note
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 24, 2021 | 1:36 PM

ప్రస్తుతం కాలంలో రూపాయికి చాలా తక్కువ విలువ ఉంది. రూపాయి మార్కెట్లో చెలామణి అవుతున్న దీనికి విలువ మాత్రం తక్కువే ఉంది. ఇక గతంలో రూపాయి నోట్లను ఉపయోగించేవారు. ఆ కాలంలో ఈ రూపాయి నోటుకు విలువ ఎక్కువగానే ఉండేది. ఇతర నోట్ల కంటే రూపాయి నోటుకు ప్రాదాన్యత ఎక్కువగా ఉండేది. దాదాపు 100 సంవత్సరాలకు పైగా చెలామణిలో ఉంది. కానీ అదే సమయంలో రూపాయి కాయిన్ కు అసలు విలువ లేదు. ఎందుకో తెలుసా..

పూర్వపు రోజులలో రూపాయి కాయిన్స్‏కు వెండితో తయారు చేసేవారట. ఆ సమయంలో రూపాయి విలువ ఎక్కువే ఉండేది. వెండికి ఎంత విలువ ఉందో.. రూపాయి కాయిన్ కు కూడా అంతే విలువ ఉండేది. కానీ ఆ తర్వాత రూపాయి నాణేంకు విలువ లేకుండా పోయింది. అందుకు కారణం కూడా లేకపోలేదు.

హిందుస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఒక రూపాయి నాణెం 10.7 గ్రాముల వెండిని కలిగి ఉంటుంది. ఈ కారణంతోనే మొదటి ప్రపంచ యుద్దం సమయంలో ఆయుధాలను తయారు చేయడానికి నాణేలను ఉపయోగించేవారట. దీంతో నాణేలకు బదులుగా కాగితపు నోట్లను తయారు చేశారు. ఒకనొక సమయంలో రూపాయి నాణెం రూ.700 వెండిని కలిగి ఉండేది.

ఈ నాణేల తరువాత, ఒక రూపాయి నోటు ముద్రించడం ప్రారంభమైంది. నవంబర్ 30, 1917 న మొదటిసారిగా ఒక రూపాయి నోటు ప్రారంభించబడింది. ఇంతకుముందు ఈ నోట్ భారతదేశంలో కాకుండా ఇంగ్లాండ్‌లో ముద్రించబడింది. ఇది తెలుపు రంగులో ఉంటుంది. ఆ తరువాత దానిలో చాలా మార్పులు జరిగాయి. 2017 సంవత్సరంలో ఈ నోట్ వచ్చి 100 సంవత్సరాలు అయ్యింది. ఈ నోటును 125 సార్లు మార్చబడింది. ప్రస్తుతం 104 సంవత్సరాలు అయిన ఇప్పటికీ ఈ నోటు చెలామణిలో ఉంది.

రెండుసార్లు ఆగిపోయింది.. 1926 సంవత్సరంలో మొదటిసారిగా ఒక రూపాయి నోట్లు ఇవ్వడం మానేసారు. కానీ 1940 లో మళ్ళీ ఒక రూపాయి నోటు మార్కెట్లోకి వచ్చింది. ఇది 1994 వరకు కొనసాగింది. 1994లో భారత ప్రభుత్వం మళ్ళీ వాటిని జారీ చేయడాన్ని ఆపివేసింది. ఈ నిషేధం 2014 వరకు కొనసాగింది. 1 జనవరి 2015 నుండి ఒక రూపాయి నోటు ముద్రణ మళ్లీ ప్రారంభమైంది.

ఇది ఇతర నోట్ల నుండి ఎందుకు భిన్నంగా ఉంటుంది? ఒక రూపాయి నోటు మినహా మిగతా నోట్లన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. ఒక రూపాయి నోటును భారత ప్రభుత్వం ముద్రించింది. ఇది ఆర్బీఐ గవర్నర్ కాకుండా ఆర్థిక కార్యదర్శి సంతకాన్ని కలిగి ఉంటుంది. ఈ నోటుపై ‘ఇంత డబ్బును హోల్డర్‌కు చెల్లిస్తానని నేను హామీ ఇస్తున్నాను’ అనే పంక్తి లేదు. అయితే, ఒక రూపాయి నోటు పంపిణీ బాధ్యత ఆర్బీఐ పై ఉంటుంది.

Also Read: రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు..5 గంటల పాటు ‘విచారణ’