Viral Video: సింహాన్ని రఫ్ఫాడించిన ముంగీస.. బెదరగొట్టి.. భయపెట్టి.. వైరల్ అవుతున్న వీడియో!
పులితో ఆట.. సింహంతో వేట.. ప్రాణాలకే పెద్ద ముప్పు. ఇది జగమెరిగిన సత్యం. అడవికి రాజైన సింహం.. తన కనుచూపు మేరలో ఏ జంతువు కనిపించినా..
పులితో ఆట.. సింహంతో వేట.. ప్రాణాలకే పెద్ద ముప్పు. ఇది జగమెరిగిన సత్యం. అడవికి రాజైన సింహం.. తన కనుచూపు మేరలో ఏ జంతువు కనిపించినా.. వేటాడకమానదు. క్షణాల్లో దాన్ని మట్టుబెడుతుంది. సాధారణ జంతువులు సింహాన్ని ఆమడదూరం నుంచి చూస్తేనే పరుగులుపెడతాయి. అలాంటి సింహాన్ని ఓ ముంగీస రఫ్ఫాడించింది. దాని ముందు కుప్పిగంతులు వేయడమే కాకుండా.. భయపెట్టి.. బెదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— African animals (@AfricanimaIs) July 22, 2021
సింహానికి ఎదురెళ్లడం అంటే డేంజర్‌తో గేమ్స్ ఆడటమే. అలాంటిది ఓ ముంగీస దాన్ని భయపెట్టింది. దాని మీదకు వెళ్తోంది. పైపైకి ఎగురుతూ దాడి చేసింది. సింహం అయితే దాన్ని ఏం చేయకుండా వెనక్కి.. వెనక్కి వెళ్తూ బెదిరిపోయింది. చివరికి తన పంజాతో ముంగీస తలపై కొట్టింది. ఈ ఆసక్తికరమైన వీడియోను ‘African Animals’ అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది. క్షణాల్లో ఈ ఫన్నీ వీడియో వైరల్‌గా మారింది. దాదాపు 45 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అలాగే వెయ్యి లైకులు సంపాదించింది.
Also Read:
రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!
జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!
ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!