Oldest Person:135 ఏళ్ల చైనా బామ్మ కన్నుమూత.. చివరి వరకు ఎలాంటి జీవితాన్ని గడిపిందో తెలుసా..?
చైనాలో శతాధిక వృద్ధురాలు అలీమిహాన్ సెయితీ కన్నుమూశారు. జిన్‌జియాంగ్ ప్రాంతంలో 135 ఏళ్ల వయసులో ఆమె మరణించినట్లు స్థానిక మీడియా శనివారం తెలిపింది.

China Oldest Woman: చైనాలో శతాధిక వృద్ధురాలు అలీమిహాన్ సెయితీ కన్నుమూశారు. జిన్‌జియాంగ్ ప్రాంతంలో 135 ఏళ్ల వయసులో ఆమె మరణించినట్లు స్థానిక మీడియా శనివారం తెలిపింది. ఈ విషయాన్ని చైనా కాస్గర్ ఆమోదించింది. . కస్గర్ ప్రిఫక్చర్‌లోని షూలే కౌంటీలోని కోముక్సెరిక్ టౌన్‌షిప్ ప్రాంతానికి చెందిన అలీమిహాన్ సెయితీ.. 1886, జూన్ 25న జన్మించారు. 2013లో చైనా అసోసియేషన్ ఆఫ్ జెరోంటాలజీ అండ్ జెరియాట్రిక్స్ జారీ చేసిన చైనా అత్యంత వృద్ధుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు.
అయితే, ఆమె మరణించే నాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణమైన సాధారణ జీవితాన్ని గడిపారు. సమయానికి తింటూ తన పెరట్లో ఎండలో నడుస్తూ ఆనందించేవారని స్థానిక మీడియా పేర్కొంది. తుదిశ్వాస వరకు తన మునిమనవళ్ల పరిరక్షణలోనే ఉందని వెల్లడించింది. 2013లో చైనా అసోసియేషన్ ఆఫ్ గెరంటాలజీ, జీరియాట్రిక్స్ విభాగం జారీ చేసిన జీవించి ఉన్న అత్యంత వృద్ధుల జాబితాలో అలిమిహాన్ పేరు టాప్‌లో ఉన్నట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. కాగా, 90 ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు ఎక్కువగా ఉండే పట్టణంగా కొముక్జెరిక్‌కు పేరుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు కూడా ఇక్కడి వారికి దీర్ఘాయుష్షును అందిస్తున్నాయని జిన్హువా తెలిపింది.
Read Also… Rai Typhoon: ఫిలిప్పీన్స్‌లో ‘’రాయ్’’ తుఫాను విధ్వంసం.. 31మంది మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు!