Kerala Boy: కేరళ నుంచి ఒంగోలుకు చేరిన చిన్నారి కథలో కొత్త ట్విస్ట్.. కన్నతల్లా..? పెంచుతున్న తల్లా? తేల్చే పనిలో పోలీసులు!
ఇది కేరళలో జరిగిన కథ.. నాలుగు రోజుల పసికందును చైల్డ్‌హోమ్‌లో పడేశాడు ఓ వ్యక్తి. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న అక్కసుతో ఈ పనికి ఒడిగట్టాడు. దీంతో అక్కడి నుంచి ఆ బిడ్డ ఒంగోలుకు చేరింది.
New twist in a Kerala Child: ఇది కేరళలో జరిగిన కథ.. నాలుగు రోజుల పసికందును చైల్డ్‌హోమ్‌లో పడేశాడు ఓ వ్యక్తి. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న అక్కసుతో ఈ పనికి ఒడిగట్టాడు. దీంతో అక్కడి నుంచి ఆ బిడ్డ ఒంగోలుకు చేరింది. ప్రకాశం జిల్లాలోని దంపతులు ఆ పసికందును దత్తత తీసుకుని అన్నీ తామై చూసుకున్నారు. చిన్నారి కాలికి మట్టి అండకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న సమయంలో పిడుగు లాంటి వార్తవచ్చి పడింది. ఆ బిడ్డ కన్నతల్లి కోర్టుకెక్కింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అది ఇష్టంలేని తన తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డారని, తనకు బిడ్డను తిరిగి అప్పగించాలంటూ కేరళ ముఖ్యమంత్రికి, సీడబ్ల్యుసీ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.
నవమాసాలు మోసి కన్న ఆ చిన్నారిని తనకు వెంటనే బిడ్డను అప్పగించాలని కేరళకు చెందిన అనుపమ కోరుతోంది. దీంతో కోర్టు ఆ చిన్నారిని తీసుకొచ్చి డీఎన్‌ఏ టెస్టులు చేయాలని ఆదేశించింది. నిన్న కేరళ సీడబ్ల్యుసీ సభ్యులు పోలీసులను తీసుకుని ఒంగోలులోని సీడబ్ల్యుసీ అధికారులను కలిశారు. చిన్నారిని దత్తత తీసుకున్న దంపతులు తమ బిడ్డను కేరళ అధికారులకు అప్పగించేందుకు ఒప్పుకున్నారు. త్రివేండ్రం నుంచి ఏడాది బాలుడ్ని దత్తత తీసుకొచ్చిన ప్రకాశంజిల్లాకు చెందిన దంపతుల నుంచి బాలుడ్ని ఆధీనంలోకి తీసుకున్నారు కేరళ పేరూర్ పోలీసులు. దీంతో ఆ బిడ్డను కేరళ తీసుకెళ్లారు అధికారులు. డీఎన్‌ఏ టెస్టుల తర్వాత సొంత తల్లికి అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే, ఈ ప్రక్రియ కన్నా ముందు ఆ బిడ్ద తల్లిదండ్రులపై విచారణ జరుపుతున్నారు అధికారులు. నిజంగానే బిడ్డను కోల్పోయిందా..? లేక ఆ తల్లి వదిలించుకుందా అనే కోణంలో కేసులు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్‌ఏ మ్యాచ్ అయినా.. ఈ విచారణ ముగిసిన తర్వాతనే బిడ్డను తల్లికి అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు, అనుపమ తండ్రిపై కేసు నమోదు చేశారు పేరూర్ పోలీసులు.
Read Also… Unstoppable with NBK : బాలయ్య టాక్ షో నెక్స్ట్ గెస్ట్ ఆమేనా.. ? చక్కర్లు కొడుతున్న వార్త..