NEST 2021: నెస్ట్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ఎప్పటినుంచి ప్రారంభమవుతుందంటే..?
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (NEST) 2021 పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నెస్ట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24..
NEST Exam 2021: నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (NEST) 2021 పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నెస్ట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులంతా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సిఉంటుంది. నెస్ట్ పరీక్షకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nextexam.in ను సందర్శించాలని అధికారులు వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. నెస్ట్ 2021 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30, 2021తో ముగుస్తుంది. మే 20 నుంచి అడ్మిట్ కార్డులు లభిస్తాయి. జూన్ 14న నెస్ట్ పరీక్షను నిర్వహిస్తారు. జూన్ 30న ఫలితాలను విడుదల చేస్తారు.
NEST 2021: అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. ఫిబ్రవరి 24 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30తో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. మే 20 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. జూన్ 14న పరీక్ష జరుగుతుంది. జూన్ 30న ఫలితాలను విడుదల చేస్తారు. మరిన్ని వివరాల కోసం.. nestexam.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: