FASTag : ఫాస్టాగ్ విషయంలో ఓ గుడ్ న్యూస్.. పనిలో పనిగా దాన్ని ఎలా కొనుగోలు చేయాలో వివరాలు మీ కోసం

ఫాస్టాగ్ విషయంలో వివిధ ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాహనదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన తాజాగా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని  కీలక సవరణలు చేసింది.

FASTag : ఫాస్టాగ్ విషయంలో ఓ గుడ్ న్యూస్.. పనిలో పనిగా దాన్ని ఎలా కొనుగోలు చేయాలో వివరాలు మీ కోసం
Follow us

|

Updated on: Feb 12, 2021 | 4:43 PM

ఫాస్టాగ్ విషయంలో వివిధ ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాహనదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన తాజాగా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని  కీలక సవరణలు చేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను బుధవారం వెలువరించింది . ఫిబ్రవరి 15వ తేదీ నుంచి టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ ను కేంద్రం తప్పనిసరి చేసిన విషయం విధితమే. వాహనదారులంతా ఫాస్టాగ్ ను తీసుకోవాల్సిందేననీ, లేదంటే ప్రయాణం ముందుకు సాగబోదని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మెజారిటీ వాహనదారులు ఫాస్టాగ్‌ను కొనుగోలు చేశారు. ఇప్పటికే టోల్ గేట్ల వద్ద దాదాపు 80శాతం చెల్లింపులు ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే  అత్యధిక వాహనదారులు ఫాస్టాగ్ విషయంలో బ్యాంకులు, వాటిని జారీ చేసిన సంస్థలు పెట్టిన ఓ రూల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు.

సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మినిమమ్ బ్యాలెన్స్ ను ఫాస్టాగ్ అకౌంట్‌లో తప్పనిసరిగా ఉండాలన్నమాట. అలా నిబంధన పెట్టడం వల్ల అత్యవసర సమయాల్లో టోల్ గేట్ల వద్దకు వచ్చే వరకు ఆ ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ ఉందనే వాహనదారులు భావిస్తున్నారు. తీరా చెల్లింపుల వద్దకు వచ్చేసరికి మళ్లీ రీచార్జ్ చేయించుకోమని చెబుతున్నారు. దీంతో అప్పటికప్పుడు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా ఈ సమస్యపై ఫోకస్ పెట్టింది. ఫాస్టాగ్ విషయంలో వాటిని జారీ చేసిన సంస్థలు పెట్టిన మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేసింది. అంతేకాకుండా వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లో టోల్ ఫీజు చెల్లించేందుకు తగిన డబ్బులేకున్నా పేమెంట్‌ జరిపి , ఫాస్టాగ్ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఏర్పడితే, నెక్ట్స్ రీచార్జ్ నుంచి మినహాయించుకోవచ్చునని తెలిపింది.

ఫాస్టాగ్‌ను ఎలా కొనుగోలు చేయాలి..?

ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని టోల్ ఫ్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్‌ను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా పేటీఎమ్ ద్వారా సొంతంగా మొబైల్ ఫోన్‌లోనే ఫాస్టాగ్ కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటు హెచ్‌డీ‌ఎఫ్‌సీ, ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలు కూడా ఫాస్టాగ్ కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఫాస్టాగ్ కార్డులో వినియోగదారుడు అతనికి నచ్చిన మొత్తంలో రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. కాఇక ఫాస్టాగ్ పరిమితి కాలం విషయానికొస్తే.. జారీ చేసిన నాటి నుంచి ఐదేళ్లు ఉంటుంది. కొత్తగా కొనుగోలు చేసిన కార్లు ఇప్పటికే FASTag అమర్చబడి ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేసుకోవాలి.

ఫాస్టాగ్‌కు కావాల్సినవి:

ఫాస్టాగ్‌ కావాలంటే పైన పేర్కొన్న బ్యాంకుల్లో వాహనం ఆర్సీ, గుర్తింపు కార్డు జిరాక్సులు రెండు సెట్లు, ఓ పాస్ పోర్టు సైజు ఫోటో, ఛార్జ్ చెల్లించాలి. గుర్తింపు కార్డు అంటే ఆధార్ లేదా పాన్ లేదా ఓటరు కార్డు వంటివి ఉపయోగించవచ్చు.

Also Read:

Student suicide: “అమ్మ లేకుండా నేనెలా బ్రతకగలను”..! క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో