India Post: చిన్న మొత్తంలో పొదుపు చేయాలనుకుంటున్నారా.. అయితే పోస్ట్ ఆఫీస్ మంచి మార్గం.. ఎంత వడ్డీ వస్తుందంటే..?

ప్రభుత్వ రంగ సంస్థ కావడం, వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా ఉండడంతో వినియోగదారులు కూడా పోస్ట్ ఆఫీసుల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిచూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ పోస్టల్ కూడా ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే..

India Post: చిన్న మొత్తంలో పొదుపు చేయాలనుకుంటున్నారా.. అయితే పోస్ట్ ఆఫీస్ మంచి మార్గం.. ఎంత వడ్డీ వస్తుందంటే..?
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 12, 2021 | 5:00 PM

India Post Interest Rate On Small Savings: ఒకప్పుడు కేవలం లెటర్ల పంపిణీకి మాత్రమే పరితమైన ఇండియన్ పోస్టల్ ప్రస్తుతం బ్యాంకింగ్ సంస్థలు అందించే సేవలను సైతం అందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ కావడం, వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా ఉండడంతో వినియోగదారులు కూడా పోస్ట్ ఆఫీసుల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిచూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ పోస్టల్ కూడా ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే చిన్న మొత్తంలో పొదుపు చేసే వారికి మంచి వడ్డీని అందిస్తోంది. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అందిస్తోన్న స్కీమ్స్ ఏంటి.? వీటి ద్వారా వినియోగదారుడు పొందే లాభలేంటన్నదానిపై ఓ లుక్కేయండి..

* సాధారణంగా పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్‌ ఖాతాలో ఉన్న మొత్తానికి ఏడాది నాలుగు శాతం వడ్డీ అందిస్తారు.

* ఏడాది పాటు డిపాజిట్ చేసిన మొత్తానికి 5.5 శాతం వడ్డీని అందిస్తారు. అంటే ఏడాది సమయానికి రూ.10 వేలకు రూ.561 వడ్డీ లభిస్తుందన్నమాట. మూడు నెలలకొకసారి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.

* 2 ఏళ్ల పాటు డిపాజిట్ చేసిన మొత్తానికి కూడా 5.5 శాతం వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకొకసారి వడ్డీని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. మూడేళ్ల పాటు డిపాజిట్ చేసిన మొత్తానికి కూడా సేమ్ 5.5 శాతం వడ్డీ లభిస్తుంది.

* ఇక ఐదేళ్లపాటు డబ్బును అకౌంట్‌లో ఉంచితే.. 6.7 శాతం వడ్డీని అందిస్తారు. దీని ద్వారా ఏడాదికి రూ.10 వేలకు రూ. 687 వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకొకసారి ఇంట్రెస్ట్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

* సీనియర్ సిటీజన్స్ కోసం ఇండియన్ పోస్టల్ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది దీనిద్వారా.. 7.4 శాతం వడ్డీని పొందొచ్చు. ఈ స్కీమ్ ప్రకారం.. మూడు నెలలకొకసారి రూ.10 వేలకు రూ.185 వడ్డీ లభిస్తుంది.

* ఇక మంథ్లీ ఇన్‌కమ్ అకౌంట్ ఉన్న వారికి.. 6.6 శాతం వడ్డీ లభిస్తుంది.

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా ఏడాదికి అత్యధికంగా 7.10 శాతం వడ్డీని అందిస్తున్నారు.

* కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ ద్వారా ఏడాదికి 7.60 శాతం వడ్డీని అందిస్తున్నారు.

* సుకన్య స‌మృద్ధి అకౌంట్ పథకం ద్వారా ఏడాదికి 7.60 శాతం వడ్డీ పొందొచ్చు.

చూశారుగా ఇండియన్ పోస్టల్ అందిస్తోన్న వడ్డీ వివరాలు ఎలా ఉన్నాయో.. మరి మీ ఆదాయం, వ్యయాల గురించి అంచనా వేసుకుంటూ.. ఏ స్కీమ్ సరిపోతుందో చూసుకొని ఆర్థిక ప్రణాళిక చక్కగా చేసుకోండి.

Also Read: Master Card : మాస్టర్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్.. క్రిప్టో కరెన్సీ లావాదేవీల విషయంలో సరికొత్త ప్రకటన..