మాల్దీవులలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ? అయితే హైదరాబాద్ నుంచి అక్కడికి డైరెక్ట్‌గా వాలిపోవచ్చు..

Special Flight: మాల్దీవులలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే హైదరాబాద్ నుంచి అక్కడికి డైరెక్ట్‌గా వాలిపోవచ్చు..

మాల్దీవులలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ? అయితే హైదరాబాద్ నుంచి అక్కడికి డైరెక్ట్‌గా వాలిపోవచ్చు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2021 | 4:15 PM

Special Flight: మాల్దీవులలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే హైదరాబాద్ నుంచి అక్కడికి డైరెక్ట్‌గా వాలిపోవచ్చు.. ఎలాగంటే జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మాల్దీవులలోని మాలేకు డైరెక్టు గో ఎయిర్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ విమానం ద్వారా అంతర్జాతీయ సర్వీసులకు ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించుకోవడం ప్రారంభించింది.

ఈ సర్వీసులు సోమ, మంగళ, గురు, శని.. వారానికి నాలుగు సార్లు ఉండనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, మాలేలను కలిపే ఈ నూతన సర్వీసు కోసం ప్రయాణికులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారన్నారు. అంతర్జాతీయ ప్రయాణానికి ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మాల్దీవుల అందాలను తిలకించాలని కోరారు.

Governor Tamilisai: అనుభవాలకు అక్షర రూపం ఇచ్చిన తెలంగాణ గవర్నర్.. పుస్తకం విడుదల చేసిన తమిళిసై..