జుట్టుకి ఉంది భలే డిమాండ్..! రెండో స్థానంలో భారత్.. వీటితో ఏం తయారవుతున్నాయో తెలుసా..?

Human Hair: వివిధ వస్తువుల ఎగుమతితో భారత్ ప్రపంచంలోని పలు దేశాలపై పట్టు సాధిస్తుంది. ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు నిత్యం దేశం

జుట్టుకి ఉంది భలే డిమాండ్..! రెండో స్థానంలో భారత్.. వీటితో ఏం తయారవుతున్నాయో తెలుసా..?
Human Hair
Follow us

|

Updated on: Sep 01, 2021 | 4:43 PM

Human Hair: వివిధ వస్తువుల ఎగుమతితో భారత్ ప్రపంచంలోని పలు దేశాలపై పట్టు సాధిస్తుంది. ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు నిత్యం దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. వీటితో పాటు మానవ జుట్టు ఎగుమతిలో కూడా భారతదేశం అగ్రస్థానంలో ఉంది. వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. మానవ జుట్టు ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అసలు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న జుట్టుతో ఏం తయారు చేస్తున్నారో ఒక్కసారి తెలుసుకుందాం.

జుట్టు ఎగుమతులు 39% పెరిగాయి 2019 తో పోలిస్తే 2020లో మానవ జుట్టు ఎగుమతి 39 శాతం పెరిగింది. హాంకాంగ్ భారతదేశం కంటే ముందు వరుసలో ఉంది. జుట్టు ఎగుమతి చేయడం ద్వారా హాంకాంగ్ 320 కోట్లు సంపాదిస్తుంది. భారతదేశం జుట్టు ఎగుమతి చేయడం ద్వారా 100 కోట్లు సంపాదిస్తుంది. భారత్ తర్వాత రూ.73 కోట్లతో మయన్మార్ ఉంటుంది. పాకిస్తాన్ రూ.14 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది యునైటెడ్ కింగ్‌డమ్ రూ.11 కోట్ల ఆదాయంతో 5 వ స్థానంలో ఉంది. చైనా ప్రపంచంలోనే జుట్టు ఉత్పత్తుల రంగంలో ప్రథమ స్థానంలో ఉంటుంది.

ఎక్కువ జుట్టు ఎక్కడ నుంచి వస్తుంది భారతదేశంలోని చాలా వెంట్రుకలు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఆలయం నుంచి వస్తాయి. 2019 సంవత్సరంలో ఆలయ అధికారులు జుట్టు ఈ-వేలం నిర్వహించింది 157 టన్నుల జుట్టుకు రూ.11 కోట్ల ధరను పొందింది. ఈ వెంట్రుకలను విగ్గుల తయారీలో, జుట్టు నేయడంలో ఉపయోగిస్తారు. విగ్గుల తయారీలో అమెరికా అతిపెద్ద మార్కెట్. ప్రస్తుతం విగ్‌లు తయారు చేసే ఫ్యాక్టరీలలో 70 శాతానికి పైగా చైనాలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద విగ్ ఫ్యాక్టరీ చైనాలోని ఉచాంగ్ నగరంలో ఉంది. ఈ నగరాన్ని విగ్ తయారీ రాజధాని అని కూడా అంటారు.

ఎడారిలో 200 అస్థిపంజరాలు.. దారుణంగా చంపేశారు..! ఇందులో సగం పురుషులు సగం మహిళలు..

Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు వరుస ఎదురుదెబ్బలు.. తాజాగా 350 మందిని హతం.. కీలక ప్రకటన చేసిన నార్తర్న్‌ అలయెన్స్‌..

Paid Post New Rules: ఇన్‌స్టా పోస్టులతో కోట్లు సంపాదిస్తున్న సెలబ్రిటీలు.. భారత్ నుంచి టాప్ ప్లేస్‌లో కోహ్లీ, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్