గొర్రెలతో హృదయాకారంలో చనిపోయిన మేనత్తకు నివాళి.. వైరల్ అవుతున్న వీడియో..:Tribute With Sheeps Video.

ప్రేమానురాగాలు ఉండాలే గానీ.. వాటిని చూపించడానికి ఎంత కష్టం ఉన్నా సమయం బి=వచ్చినప్పుడు బయటపడతాయి. మాటల్లో చెప్పలేని అనుభూతిని చేతల రూపంలో చూపించాలి అంటే ఓ అద్భుత ఆలోచన. అటువంటి ఓఅద్భుతాన్ని మూగ జీవాలతో ఆవిష్కరించి తన మేనత్తకు...

మనసుండాలే గానీ, ప్రేమను ఏ రూపంలోనైనా వ్యక్తపరచొచ్చు.ముఖ్యంగా చేతల్లో చూపించే ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సాధారణంగా మాటలకు అందని భావాలను చిత్రాల రూపంలో చూపిస్తుంటారు. అయితే దృశ్యరూపంలో చూపించే ప్రేమ అద్భుతంగా ఉంటుంది. ఒక రైతు అలాంటి ఓ అద్భుతమైన దృశ్య రూపాన్ని సృష్టించి అందరి మనసులను గెలుచుకుంటున్నారు. తన గొర్రెల మంద తో హృదయ పూర్వక నివాళిఅర్పించి వావ్ అనిపించారు.

కరోనా వల్ల చాలా మంది తమ కుటుంబ సభ్యులు, అయిన వారిని కోల్పోయారు. కోవిడ్‌ ఆంక్షల నడుమ సొంతవారు చనిపోయినా అంతిమ సంస్కారాలు చేయ లేకపోయారు. అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. అటువంటి వారిలో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన ఓ రైతు కూడా ఒకరు. కరోనా సమయంలో చనిపోయిన అత్తకు ఇలా వెరైటీ నివాళి అర్పించారు..ఎవరూ ఊహించని విధంగా తన క్రియేటివీటిని ప్రదర్శించారు. తన గొర్రెల చేత పొలంలో హృదయం ఆకారంలో గొర్రెల కోసం మేత వేసి వాటిని వదిలారు. దాంతో కొద్ది నిమిషాల్లోనే గొర్రెల అన్నీ కలిసి హృదయాకారంలో చేరి మేత మేయడం ప్రారంభించాయి. ఆ సమయంలో అతను కెమెరాతో గొర్రెల ఆకారాన్ని ఫోటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు..కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


మరిన్ని ఇక్కడ చూడండి: Flood in Siddipet Video: యువకుడుని మింగేసిన వరద.. చూస్తుండగానే బైక్ తో సహా గల్లంతు..(వీడియో).

ఎంపీ సంతోష్ కుమార్ వినూత్న యత్నం విత్తన గణపతులతో ఈ సారి..:Seed Ganapati Idols Video.

అఖిల్ సినిమాలో ఆ స్టార్ కపుల్.. అఖిల్ ఆశలన్నీ ఆ సినిమాపైనే..:Akkineni Akhil New Movie Video.

రోడ్డు దాటుతున్న ఓ ఫ్యామిలిని ఢీ కొట్టిన బైక్‌..వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో..:Accident Viral Video.

Click on your DTH Provider to Add TV9 Telugu