AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఖాకీ యూనిఫాం వెనుక వెన్నలాంటి మనసు.. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించిన సూపర్ పోలీస్..

నిత్యం నేరగాళ్లతో కుస్తీ పట్టే పోలీసులు.. చట్టాన్ని అమలుచేసే విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంటారు. అయితే వారి ఖాకీ యూనిఫాం వెనుక దాగి ఉన్న వెన్నలాంటి మనస్సు కూడా అప్పుడప్పుడూ బయటపడుతూ ఉంటుంది.

Viral News: ఖాకీ యూనిఫాం వెనుక వెన్నలాంటి మనసు.. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించిన సూపర్ పోలీస్..
Nagpur Super Police
Janardhan Veluru
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 14, 2021 | 7:56 PM

Share

నిత్యం నేరగాళ్లతో కుస్తీ పట్టే పోలీసులు.. చట్టాన్ని అమలుచేసే విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంటారు. అయితే వారి ఖాకీ యూనిఫాం వెనుక దాగి ఉన్న వెన్నలాంటి మనస్సు కూడా అప్పుడప్పుడూ బయటపడుతూ ఉంటుంది. గతంలో చాలా మంది పోలీసులు తమ పెద్ద మనసును చాటుకుని సూపర్ పోలీస్ అనిపించుకున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ తన మానవత్వంతో అందరి మెప్పు పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ చేసిన తప్పుకు విధించిన జరిమానాను స్వయంగా ఆ పోలీస్ ఆఫీసర్ తన సొంత డబ్బుతో చెల్లించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌కు చెందిన రోహిత్ ఖడ్సే ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన చలాన్లు(రూ.2వేలు) చెల్లించకపోవడంతో ఆయన ఆటోను నాగ్‌పూర్ పోలీసులు ఇటీవల సీజ్ చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పిల్లల కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న సొమ్ముతో చలాన్లు క్లియర్ చేసుకుని ఆటోను విడిపించుకోవాలనుకున్నాడు.

ఆ మేరకు రూ.2000 నాణేలు తీసుకుని ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు కౌంటర్‌కు వెళ్లాడు. అయితే అన్ని నాణేలు తమకు ఎందుకంటూ వాటిని తీసుకునేందుకు కౌంటర్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించి రూ.2000 నాణెలు (ప్లాస్టిగ్ బ్యాగ్‌లో ఉంచినవి) తీసుకుని తన ఆటోను విడిపించాలని వేడుకున్నాడు. సదరు ఆటోడ్రైవర్ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుని సీనియర్ పోలీస్ ఇనిస్పెక్టర్ అజయ్ కుమార్ మాలవ్య చలించిపోయాడు. దీంతో ఆటో డ్రైవర్ చెల్లించాల్సిన చలాన్లను స్వయంగా తానే చెల్లించి.. రూ.2000 నాణెలను రోహిత్ ఖడ్సే కుమారుడికి తిరిగి ఇచ్చేశాడు. నాగ్‌పూర్ సిటీ పోలీసుల ట్విట్టర్ ఖాతా నుంచి ఈ ఫొటోను షేర్ చేయగా..పలువురు నెటిజన్స్ ఆ పోలీస్ ఆఫీసర్‌ను అభినందిస్తున్నారు.

ఆగస్టు 8న నో పార్కింగ్ జోన్‌లో ఆటోను పార్క్ చేసినందుకు జరిమానా విధించినట్లు నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. అంతకు ముందు కూడా ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘనలకు సంబంధించిన కొన్ని చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో చలాన్లు చెల్లించలేకపోయినట్లు ఆటో డ్రైవర్ తెలియజేసినట్లు పోలీస్ ఇనిస్పెక్టర్ అజయ్ కుమార్ మాలవ్య ఏఎన్ఐకి తెలిపారు. అతని ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుని తానే చలాన్లు చెల్లించినట్లు చెప్పారు. పోలీస్ ఇనిస్పెక్టర్ మాలవ్య తన గొప్ప మనస్సుతో మానవత్వంపై నమ్మకం కలిగించారంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.

Also Read: పోలీసులకు చుక్కలు చూపించిన మీరా మిథున్.. టచ్ చేస్తే ఆత్యహత్య చేసుకుంటా.. వీడియో వైరల్..

ఛాతిలోకి గునపం దిగినా అతడి ధైర్యం చెక్కుచెదరలేదు.. మరణం.. అతడి మనోధైర్యం ముందు మోకరిల్లింది

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ