Calf: దూడని పూడ్చిపెట్టడానికి తరలిస్తుంటే.. తల్లి ఆవు ట్రక్ వెనుక కిలో మీటర్ల మేర పరుగు.. గుండెలు పిండేసే ఘటన

సృష్టిలో తల్లి ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు. అది నోరు లేని మూగజీవైనా.. మనిషైనా.. పక్షులైనా.. జాతి ఏదైనా తల్లి తల్లే. అందరికీ ఒక్కటే మమకారం....

Calf: దూడని పూడ్చిపెట్టడానికి తరలిస్తుంటే..  తల్లి ఆవు ట్రక్ వెనుక కిలో మీటర్ల మేర పరుగు.. గుండెలు పిండేసే ఘటన
Cow 2
Follow us

|

Updated on: Jul 18, 2021 | 12:49 PM

Mother cow : సృష్టిలో తల్లి ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు. అది నోరు లేని మూగజీవైనా.. మనిషైనా.. పక్షులైనా.. జాతి ఏదైనా తల్లి తల్లే. అందరికీ ఒక్కటే మమకారం.. ఒక్కటే పేగు బంధం.. ఆమె చూపించే ప్రేమ కూడా ఒక్కటే. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన చూస్తే అందరి మనసులు చలించాల్సిందే.

వివరాల్లోకి వెళితే,  రాజమహేంద్రవరంలో పది రోజుల కిందట ఓ ఆవు దూడను బైక్ ఢీకొట్టింది. రహదారిపై గాయాలతో ఉన్న దూడను జంతు ప్రేమికులు స్థానికంగా ఉన్న గోసాలకు తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆవు దూడ ప్రాణాలు దక్కలేదు. మృతిచెందిన ఆవు దూడకు శాస్త్రోక్తంగా అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యానులో దూడ డెడ్ బాడీని ఉంచి.. డప్పులు కొడుతూ తుది యాత్ర చేపట్టారు.

Heart Tourching

అయితే బిడ్డను తీసుకెళ్తుంటే తట్టుకోలేని ఆతల్లి.. రోడ్డు వెంట స్మశానం వరకూ పరుగులు తీసింది. అడుగడుగునా.. ఆ వ్యానుకు అడ్డు పడుతూ.. తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆవు వెంట మరో ఆవు కూడా రోడ్ల వెంట ట్రక్ వెంబడి పరుగులు తీస్తుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.  

Cow 3

కళ్లలో దుఃఖాన్ని దిగమింగులేక.. దూడ కోసం ఆరాటం. తిరిగి రాదని తెలుసుకోలేని.. గోమాత ఆవేదన. గుండెలు అవిసేలా రోదించడానికి కూడా నోరులేని ఆ మూగజీవి తపన.  రోడ్డు వెంట వాహనాలు వస్తున్నా ఆ ఆవుకు పట్టలేదు. ఏదైనా వాహనం తగిలితే తన ప్రాణాలు పోతాయన్న ధ్యాస కూడా లేదు. స్మశానం వరకూ పరుగులు తీసి చివరి వీడ్కోలు పలికింది.

ఆ తర్వాత సంప్రదాయ పద్ధతిలో ఆవు దూడకు అంత్యక్రియలు నిర్వహించారు జంతు ప్రేమికులు. ఈ మూగజీవి మాతృప్రేమను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అయిన వాళ్లే స్మశానానికి రాని ఈ రోజుల్లో.. ఆవు తన దూడ కోసం పరిగెత్తడం అందరినీ కంటతడి పెట్టించింది.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..