AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకులు పగబడతాయా.. ఈ ప్రాణులకు ఉండే షాకింగ్ సూపర్ పవర్స్ ఇవే..

మనుషులే భూమ్మీద అత్యంత తెలివైన వారని సంబరపడిపోతుంటారు. నిజమే.. కొన్ని రకాల భవోద్వేగాలు మనుషుల్లో ఎక్కువుంటాయి. కానీ ఈ మూగ జీవులు కూడా మనుషుల కన్నా తెలివిగా ప్రవర్తించగలవు. వాటి అవసరానికి తగ్గట్టుగా వాటినవి మార్చుకోగలవు. మనుషులతోనూ ఇవి స్నేహంగా ఉంటాయి. ఈ జీవులకు ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఇవి మనుషులతో మమేకమైపోగల క్వాలిటీస్ ను కలిగి ఉంటాయి.

కాకులు పగబడతాయా.. ఈ ప్రాణులకు ఉండే షాకింగ్ సూపర్ పవర్స్ ఇవే..
Crow Intresting Facts
Bhavani
| Edited By: |

Updated on: Feb 22, 2025 | 9:45 PM

Share

కొన్ని జంతువులను చూసినా, అవి చేసే పనులు తెలిసినా వెంటనే వాటిని తెగ పొగిడేస్తుంటాం కదా. నిజానికి కొన్ని జంతువులు మనం ఊహించిన దానికంటే చాలా తెలివితేటలు కలిగి ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకుంటాయి. కమ్యూనికేషన్ పెంచుకుంటాయి. ప్రమాదాలను ముందుగానే గుర్తిస్తాయి. ఇలాంటి చాలా గ్రేట్ క్వాలిటీస్ వాటికి ఉంటాయి. అలాంటి అరుదైన జీవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

చింపాంజీలు..

చింపాంజీలు మనుషులు, జంతువుల ముఖాలను అద్శుతంగా గుర్తుంచుకోగలవు. అది కూడా సాదాసీదాగా కాదు. ఎంతో కచ్చితత్వంతో మనుషులను ఎన్నేళ్ల తర్వాత చూసినా గుర్తుపట్టేంత మెమరీ పవర్ వీటికి ఉంటుందట. అంతేకాదు తాము సంపాదించుకున్న ఆహారాన్ని ఒక చోట దాచి వాటి కోసం ఎన్నేళ్ల తర్వాతైనా ఆ స్థావరానికి తిరిగి వెళ్లగలవట.

డాల్ఫిన్లు..

డాల్ఫిన్లు ఎంతో ప్రత్యేకమైన జలచరాలు. ఇవి మనుషుల మాదిరిగానే నవ్వగలవు. మనుషులను అమితంగా ఇష్టపడతాయి. డాల్ఫిన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు. ఎలా అంటే ఇవి ప్రత్యేకమైన ఈల శబ్దాలను చేస్తూ సంభాషించుకుంటాయి. ఆ శబ్దం మళ్లీ 20 ఏళ్ల తర్వాత వినిపించినా కూడా వాటిని కనిపెట్టగలవట.

ఏనుగులు..

ఏనుగులకు అసాధారణమైన లాంగ్ టర్మ్ మెమరీని కలిగి ఉంటాయి. ఇవి మనుషులను గుర్తుంచుకోగలవు. మనుషులతో వాటి అనుబంధాన్ని ఏనుగులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాయి. అడవిలో జీవించడానికి ఏనుగులకు తమ మెమరీ పవర్ ఎంతగానో ఉపయోగపడుతుందట.

కాకులు

కాకులకు హిందూ శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం కల్పించారు. వీటిని పితఈదేవతల స్వరూపంగా భావిస్తారు. అయితే, కాకులు మనుషుల ముఖాలను గుర్తుంచుకోగలవు. అంతేకాదు కాకులకు హాని కలిగించేవారిని గుర్తుంచుకుని వారి పట్ల కోపాన్ని కూడా పెంచుకుంటాయట. అందుకే కాకులతో కాస్త జాగ్రత్త.

గుర్రాలు..

గుర్రాలు మనుషుల వాయిస్ లను గుర్తుంచుకుని వాటి ద్వారా ముఖాలను కూడా గుర్తుపడతాయట. తమకు సేవలు చేసే నిర్వహకులను గుర్రాలు ఏళ్ల తరబడి మర్చిపోకుండా వారి కోసం ఎదురుచూస్తాయట. వీటికి ఉండే ఈ కెపాసిటీ వల్లే గుర్రాలకు ట్రైనింగ్ ఇవ్వడం సులువవుతుంది.

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?