Viral News: డబ్బు.. డబ్బు.. మనిషి ప్రాణాల మీదకు తీసుకువచ్చే అత్యాశ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Money.. Money: ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించండి. మనిషి ఏదైనా ఒక కార్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని సాధించడాన్ని కోరిక అంటాము. కోరిక తీరిన తరువాత దానితో తృప్తి పడుట గాల్లో..
Money.. Money: ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించండి. మనిషి ఏదైనా ఒక కార్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని సాధించడాన్ని కోరిక అంటాము. కోరిక తీరిన తరువాత దానితో తృప్తి పడేందుకు గాల్లో మేడలు కట్టడాన్ని ఆశ అంటాం. ఆశ మనిషిని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. అత్యాశ మనిషిని పాతాళానికి తీసుకుపోతుంది. ఆశ మనిషిని బతికిస్తుంది అత్యాశ సుఖాన్ని, బంధాలు అన్నింటినీ దూరం చేసేలా చేస్తుంది. కొంతమంది ఆశతో ఎదిగినా అత్యాశతో చచ్చి బతికుతున్నారు. ఈ రోజుల్లో మనిషి బతికేందుకు డబ్బుతో ముడిపడి ఉంది. బతికున్నన్ని రోజుల సమాజంలో మంచి గౌరవంగా బతకడం. మంచి పేరు సంపాదించుకోవడం. కానీ చనిపోయిన తర్వాత ఎంత డబ్బున్న వెంట తీసుకెళ్లలేము. కానీ డబ్బును కానీ అతిగా డబ్బుకు ఆశపడి పరుగెడితే చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. డబ్బు మనిషిని చంపేస్తుంది అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. డబ్బు సంపాదించుకునేందుకు మనల్ని మనపే చంపేసుకుంటున్నామని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే చనిపోయే వరకు డబ్బు కోసం పరుగెత్తడమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న వీడియో తెగ వైరల్ అవుతోంది.
అయితే ప్రస్తుతమున్న రోజుల్లో మనిషికి డబ్బే ముఖ్యమైపోతుంది. ఎంత డబ్బు ఉన్నా.. ఇంకా సంపాదించాలనే ఆశ. డబ్బు అతిగా సంపాదించాలనే ఆశతో మనిషి వివిధ రోగాల బారిన పడి మరణానికి చేరువవుతున్నాడు. ఎంత సంపాదించినా.. చివరికి డబ్బు వెంట తీసుకుపోలేనిది. మనిషి ఉన్నన్ని రోజులు ఉన్నదానితోనే సంతోష పడక అత్యాశకు వెళ్తున్నాడు. డబ్బే ముఖ్యంగా భావించే కొందరు అత్యాశకు దిగి ప్రాణాలు పోయేంత వరకు డబ్బు వెంటే పడుతున్నాడు. కానీ డబ్బు కోసం ఎంత పరుగెత్తినా చనిపోయిన తర్వాత ఉన్న డబ్బులు వెంట తీసుకెళ్లలేమనే విషయం గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
View this post on Instagram