AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Life Certificate: పెన్షనర్లు సూచన.. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తిరస్కరించబడిన వెంటనే ఇలా చేయండి.. లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది..

ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షనర్లు (Pensioners) సమయానికి తమ పింఛను ప్రతి నెలా తీసుకోవాలంటే ఎప్పటికప్పుడు తప్పనిసరిగా సమయానికి లైఫ్‌ సర్టిఫికేట్‌ అందజేయాల్సి ఉంటుంది. జీవన్‌ ప్రమాణ్‌ పత్ర (Jeevan Pramaan Patra)గా..

Digital Life Certificate: పెన్షనర్లు సూచన.. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తిరస్కరించబడిన వెంటనే ఇలా చేయండి.. లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది..
Pension
Sanjay Kasula
|

Updated on: Mar 13, 2022 | 7:24 PM

Share

ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షనర్లు (Pensioners) సమయానికి తమ పింఛను ప్రతి నెలా తీసుకోవాలంటే ఎప్పటికప్పుడు తప్పనిసరిగా సమయానికి లైఫ్‌ సర్టిఫికేట్‌ అందజేయాల్సి ఉంటుంది. జీవన్‌ ప్రమాణ్‌ పత్ర (Jeevan Pramaan Patra)గా పేర్కొనే లైఫ్‌ సర్టిఫికేట్‌ను 2022 ఫిబ్రవరి 28వ తేదీలోగా ప్రభుత్వ పెన్షనర్లు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్ల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ప్రారంభించింది. ఈ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో పొందవచ్చు. అతిపెద్ద విషయం ఏమిటంటే మీరు పెన్షన్ పొందే బ్యాంకు లేదా ఏజెన్సీకి సమర్పించాల్సిన అవసరం లేదు. వృద్ధులు లేదా వికలాంగులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని ఇంట్లో కూర్చొని పింఛను పొందేలా ఈ కొత్త సదుపాయం కరోనా కాలంలో ప్రారంభించబడింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో తయారు చేయబడినందున.. అన్ని పనులు ఆన్‌లైన్‌లో జరిగిపోతాయి. (Jeevan Praman Patra Online Apply), కొంత లోపం పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లోపం కారణంగా తిరస్కరించబడవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ పెన్షన్ ఆగిపోతుంది.

ఇప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కొన్ని కారణాల వల్ల తిరస్కరణకు గురైతే పింఛను ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ప్రశ్న. సాధారణ పరిష్కారం ఏమిటంటే.. సర్టిఫికేట్ తిరస్కరించబడినట్లయితే.. మీరు వెంటనే పెన్షన్ పంపిణీ ఏజెన్సీని సంప్రదించాలి. మీ సమస్యను ఏజెన్సీకి తెలిపండి. సర్టిఫికేట్‌లో ఇచ్చిన తప్పుడు సమాచారం కారణంగా.. అది తిరస్కరించబడి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో వెంటనే మీరు కొత్త జీవన్ ప్రమాణ్ లేదా ప్రమాణ్-ID కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ IDలో మొత్తం సమాచారాన్ని సరిగ్గా నింపండి. బయోమెట్రిక్ వివరాలను కూడా ఇవ్వండి. వీలైనంత త్వరగా ఈ పని చేయండి.. ఎందుకంటే ఈ ID సిద్ధమైన తర్వాత మాత్రమే జీవన్ ప్రమాణ్‌కు సంబంధించిన పని ఆమోదించబడినట్లు పరిగణించబడుతుంది. దీని ఆధారంగా మీ పింఛను విడుదల చేయబడుతుంది.

లైఫ్ సర్టిఫికేట్..

డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను బ్యాంకుకు, పోస్టాఫీసుకు లేదా పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీకి తీసుకెళ్లి సమర్పించాలా అనే ప్రశ్న కూడా చాలా మంది మనస్సులో ఉంది. దీనికి సంబంధించిన అన్ని పనులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున పెన్షనర్ స్వయంగా ఈ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సిన అవసరం లేదు. మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ రూపొందించబడిన వెంటనే.. దాని డేటా ఆటోమేటిక్‌గా లైఫ్ సర్టిఫికేట్ రిపోజిటరీకి వెళుతుంది. దీని తర్వాత, ఇది ఇంటర్నెట్ ద్వారా మీ పెన్షన్ పంపిణీ ఏజెన్సీకి స్వయంచాలకంగా బదిలీ చేయబడుతుంది. ఈ పనులన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Honey Bitter: ఇక్కడ తేనె చెదుగా ఉంటుంది.. అయినా అమృతమే.. ఈ ప్రదేశంలో అదే స్పెషల్.. ఎక్కడంటే..

Andhra Pradesh: జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టిన సర్పంచ్.. కదలివచ్చిన గ్రామం.. కారణం తెలిస్తే..