క్యాన్సర్ రోగి స్ఫూర్తికి వందనం! ‘ప్రభుత్వ ఉద్యోగం’ ఇప్పిస్తానన్న జడ్జి.. కాబోయే టీచర్ ఏం చెప్పిందో తెలుసా!

క్యాన్సర్ రోగి స్ఫూర్తికి వందనం! ‘ప్రభుత్వ ఉద్యోగం’ ఇప్పిస్తానన్న జడ్జి.. కాబోయే టీచర్ ఏం చెప్పిందో తెలుసా!
Teacher

పశ్చిమ బెంగాల్‌లో ఒక కాబోయే ఉపాధ్యాయురాలు తన ఆత్మగౌరవానికి విరుద్ధమైనందున కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరించింది.

Balaraju Goud

|

Apr 14, 2022 | 4:29 PM

Kolkata Cancer Victim Teacher: పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఒక కాబోయే ఉపాధ్యాయురాలు తన ఆత్మగౌరవానికి విరుద్ధమైనందున కోర్టు న్యాయమూర్తి(Judge) ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరించింది. నిజానికి ఈ క్యాన్సర్ బాధితురాలు బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC)లో నియామకం కోసం ఆందోళన చేస్తోంది. గత కొన్ని నెలలుగా, ఉద్యోగాల కోసం ప్రజలు ధర్నాలో పాల్గొంటున్నారు. ఉపాధ్యయ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ వందలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బీర్భూమ్‌లోని నల్హటికి చెందిన సోమదాస్ కూడా ఈ ఉద్యోగ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సోమదాస్‌కు క్యాన్సర్ ఉన్నప్పటికీ, తన ఉపాధ్యాయ పదవి కోసం పగలు, రాత్రి మేల్కొంటూ ఉద్యమిస్తున్నారు. న్యాయం కోరుతూ కోల్‌కతా వీధుల్లో ధర్నాకు కూర్చున్నారు.

కోల్‌కతా హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఉపాధ్యాయురాలు సోమదాస్ గురించి తెలుసుకున్నారు. అతను కోర్టులో కలవడానికి సోమ దాస్‌ను పిలిచారు. గత బుధవారం జడ్జి గంగోపాధ్యాయను కలిసేందుకు సోమ దాస్ కోర్టుకు చేరుకున్నారు. న్యాయమూర్తి ఆమెను మీరు ఏదైనా ప్రభుత్వ శాఖలో పని చేయాలనుకుంటున్నారా? అందుకు నేరు సిఫార్సు చేస్తానని ఆఫర్ ఇచ్చారు. దానికి సోమ దాస్ స్పందిస్తూ.. “లేదు, టీచర్ కావాలనే నా కలను వదులుకోలేను” అని తేల్చి చెప్పేశారు. దీనిపై న్యాయమూర్తి గంగోపాధ్యాయ మాట్లాడుతూ.. కోర్టు మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అవకాశం వస్తే తప్పకుండా చెబుతాను అంటూ ఆమెను అభినందించి పంపించేశారు.

“నాకు సానుభూతి ఉద్యోగం వద్దు. అవినీతిపై నా పోరాటం, మన ఘనత కోసమే పోరాడుతున్నాము” అని సోమ దాస్ అన్నారు. అసలే టీచర్ రిక్రూట్‌మెంట్‌లో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా, కోర్టులో విచారణ కొనసాగుతోంది.

Read Also…  Prime Ministers Museum: నెహ్రూ నుంచి మోదీ వరకు అందరి చరిత్ర.. ప్రధానమంత్రి మ్యూజియం ప్రత్యేకతేంటో తెలుసుకోండి!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu