తిరుపతి జిల్లా ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని నారాయణవనంలో ఉంది ఈ సొరకాయల స్వామి ఆలయం. పూర్వకాలంలో,చెన్నై, పుత్తూరు, పరిసరాలు సందర్శిస్తూ ఒక స్వామి చివరగా శ్రీవారి దర్శ నార్థం ఈ ప్రాంతానికి వచ్చారట..ఏడుకొండల వారిని దర్శించుకుని వెళ్లుతున్న సమయంలో నారాయణవనం కనిపించిందట.