Prime Ministers Museum: నెహ్రూ నుంచి మోదీ వరకు అందరి చరిత్ర.. ప్రధానమంత్రి మ్యూజియం ప్రత్యేకతేంటో తెలుసుకోండి!

భారతదేశంలోని 14 మంది మాజీ ప్రధానుల గురించిన సవివరమైన సమాచారం మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మ్యూజియంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి మదానిని సిద్ధం చేయడానికి ఎంత ఖర్చవుతుంది. ఒక్కసారి పరిశీలిద్దాం...

Balaraju Goud

|

Updated on: Apr 14, 2022 | 4:07 PM

ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ కాంప్లెక్స్‌లో పూర్తయిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ మ్యూజియం తొలి టికెట్‌ను కూడా ప్రధాని మోదీ కొనుగోలు చేశారు.

1 / 9
ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి మ్యూజియం నిర్మించడం జరిగింది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు ప్రధానమంత్రులందరి జీవిత విశేషాలను ఈ మ్యూజియంలో సవివరంగా సేకరించారు.

2 / 9
ప్రధానమంత్రి మ్యూజియంలో భారత రాజ్యాంగానికి కూడా స్థానం కల్పించారు. ఈ మ్యూజియం స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ చరిత్రను, ప్రధాన మంత్రుల జీవితాలు, వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందుపర్చారు.

3 / 9
 ప్రధాన మంత్రులందరి ప్రసంగాల సేకరణ కూడా ఉంది. ప్రధానమంత్రుల వ్యక్తిగత వస్తువులను వారి కుటుంబాల నుంచి సేకరించారు. ఈ అంశాలు డిజిటల్ డిస్‌ప్లే ద్వారా చూపడం జరుగుతుంది. మాజీ ప్రధానుల గురించి నేషనల్ మ్యూజియం నుండి సేకరించిన అరుదైన సమాచారం మొత్తం PM మ్యూజియంలో కూడా అందుబాటులో ఉంటుంది.

4 / 9
ప్రధానమంత్రుల గురించిన సమాచారాన్ని పొందడానికి దూరదర్శన్, ఫిల్మ్ డివిజన్, పార్లమెంట్ టీవీ, రక్షణ మంత్రిత్వ శాఖ, మీడియా హౌస్, ప్రింట్ మీడియా, ఫారిన్ న్యూస్ ఏజెన్సీలు, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని మ్యూజియంల నుండి కూడా సహాయం తీసుకున్నారు. మ్యూజియంలో వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్, మల్టీ మీడియా, ఇంటరాక్టివ్ కియోస్క్‌లు, కంప్యూటరైజ్డ్ కైనటిక్ శిల్పాలు, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు, ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు వంటి అత్యాధునిక సాంకేతికత ఉంది.

5 / 9
ప్రధాన మంత్రి మ్యూజియంలో చాలా గ్యాలరీలు ఉన్నాయి. వీటి ద్వారా స్వాతంత్య్ర పోరాట ప్రదర్శన మొదలు రాజ్యాంగం రూపొందించే వరకు కథలు ప్రదర్శించారు. పాత   కొత్త మ్యూజియం బ్లాక్ Iగా గుర్తించబడిన పూర్వపు తీన్ మూర్తి భవన్, బ్లాక్ IIగా గుర్తించన కొత్తగా నిర్మించిన భవనంతో కలపడం జరిగింది. ఈ రెండు బ్లాకుల మొత్తం వైశాల్యం 15,600 చదరపు మీటర్ల కంటే ఎక్కువ. నెహ్రూ మ్యూజియం తీన్ మూర్తి భవన్‌లో కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి మ్యూజియంలోని బ్లాక్ 1లో ఉంది. ఇందులో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జీవితానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచారు. యువతకు సులువుగా, ఆసక్తికరంగా సమాచారాన్ని అందజేసేందుకు ప్రధాని మ్యూజియంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత కమ్యూనికేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

6 / 9
ఈ మ్యూజియం ఖర్చు దాదాపు రూ.271 కోట్లు. ఇది 2018లో ఆమోదించడం జరిగింది. దీనిని సిద్ధం చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. నెహ్రూ మ్యూజియం ప్రాంగణంలో దాదాపు 10 వేల చదరపు మీటర్లలో ఈ మ్యూజియం నిర్మించారు. మ్యూజియం, భవనం అభివృద్ధి చెందుతున్న భారతదేశం కథ నుండి ప్రేరణ పొందింది.

7 / 9
ప్రధానమంత్రి మ్యూజియం 10,491 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించారు. దీన్ని తయారు చేయడంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీని కోసం ఏ చెట్టును కత్తిరించలేదు, నాటలేదు. దాని భవనం చిహ్నం భారతదేశ ప్రజల చేతిలో 'చక్ర', ఇది దేశానికి ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

8 / 9
PM Museum

PM Museum

9 / 9
Follow us